Thursday, March 31, 2016

ప్రేమకళ- చివరగా సముద్రతీరం ఉంది





చివరగా సముద్రతీరం ఉంది






స్త్రీ వేటకు తగిన ప్రదేశాలు ఇన్నని లెక్క చెప్పాలంటే అవి సముద్రతీరంలోని ఇసుక రేణువుల సంఖ్య కన్నా ఎక్కువే ఉంటాయి.


అయితే, (26) బేయే అనే ప్రాంతం ఉంది. అక్కడి సముద్రంలో తెల్లటి తెరచాపలు అలా కనబడి ఇలా మాయమౌతుంటాయి. అక్కడ గంధకంతో మరుగుతున్న వేడినీటి బుగ్గలుంటాయి.


తమ ఆరోగ్యం కొరకు అక్కడ స్నానం చేయడానికి వెళ్ళిన పురుషులలో చాలామంది తిరిగి వచ్చేసమయంలో “ఆ వేడినీటి స్నానాలు అందరూ చెబుతున్నంత ఆరోగ్యకరమైనవేమీ కావు” అని అంటారు.


రోమ్‌నగర ప్రవేశద్వారాలకు సమీపంలో, తరుచ్ఛాయలలో ఉన్న (27)(28) డయానా దేవాలయాన్ని చూడు! అక్కడ పూజారిపదవి కోసమే తీవ్ర పోరాటం చేయవలసి ఉంటుంది.


డయనా కన్య కనుక, ఆమె కాముడి బాణాలను ద్వేషిస్తుంది కనుక, ఆమె అక్కడి వారికి అనేక గాయాలను చేసింది, ఇక ముందు కూడా చేస్తుంది.




Footnote:



(26) బేయే (Baiae) ఇటలీలో నేపుల్స్ నగరానికి సమీపంలోఉన్న ఒక సముద్రతీర పట్టణం, ఇది ఆరోగ్యం కొరకు చేసే వేడినీటిస్నానాలకు ప్రసిద్ధి చెందినది.


(27) డయానా దేవాలయం రోమ్‌నగరానికి సమీపంలోని అరీసియా (Aricia) అనే ప్రాంతంలో ఒక చిన్న అడవి మధ్యన ఉన్నది. సంవత్సరానికొకసారి ఆ దేవాలయ పూజారికి ఆ పదవిని కోరే బానిసలతో జరిగే ద్వందయుద్ధపోటీలో, ఏ బానిస ఆ పూజారిని వధిస్తే, ఆ బానిసకు కొత్త పూజారి పదవి దక్కేది. ఆ పూజారి తనను రాజుగా, ఆ దేవాలయాన్ని రాజ్యంగా భావిస్తుంటాడు.


(28) డయానా దేవత స్త్రీలకు పూజనీయురాలు. ఈమెను పూజించడానికి రోమన్ స్త్రీలు దీపాలు చేతబట్టి పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా ఈ దేవాలయానికి వచ్చేవారు. ఈ దేవత తాను కన్యగా ఉండి, తనను అనుసరించి ఉండే స్త్రీలంతా కూడా కన్యలుగా ఉండాలని ఆదేశిస్తుంది. ఈమె స్త్రీల సంరక్షణకు, వేటకు అధిదేవత. ఈమె వేట దుస్తులు ధరించి, చేతిలో విల్లు, బాణాలతో ఉంటుంది.










No comments:

Post a Comment