Friday, January 16, 2009

Law 20 : ఏ పక్షానికీ కట్టుబడకు

DO NOT COMMIT TO ANYONE

ఏ ఒకరికీ కట్టుబడకు


It is the fool who always rushes to take sides. Do not commit to any side or cause but yourself. By maintaining your independence, you become the master of others—playing people against one another, making them pursue you.


అవివేకి మాత్రమే ఏదో ఒక పక్షంలో చేరిపోవడానికి పరుగులు తీస్తాడు. నీవు నీ స్వప్రయోజనానికి తప్ప ఏ పక్షానికీ కట్టుబడకు. నీ స్వతంత్రతను నిలుపుకోవడం ద్వారా మనుషులను ఒకరి మీదకు మరొకరిని ఉసిగొల్పి, వాళ్ళంతా సహాయం కోసం నీ వెంటబడేటట్లు చేయడం ద్వారా, నీవు ఇతరుల మీద పెత్తనం చెలాయించగలవు.

Image : యువరాణి : అందరి దృష్టీ ఆమె మీదే ఉంటుంది. అందరూ ఆమెనే కోరుకుంటారు.. అమెనే ఆరాధిస్తారు. ఆమె మాత్రం ఏ ఒక్కరికీ వశం కాకుండా అందరినీ తన చుట్టూ-తమ కక్ష్య (orbit) ను వీడీ పోలేని, ఆమెకు దగ్గరా కాలేని-గ్రహాల్లా తిప్పుకుంటూ ఉంటుంది.

Reversal : ఇది చాలా సున్నితమైన ఆట. దీనిని మరీ ఎక్కువ మందితో, మరీ ఎక్కువ కాలం ఆడకూడదు. వాళ్ళంతా ఒక నాటికి అసలు సంగతి గ్రహించి, అందరూ కలసి ఒక్కటై నీ మీదికే రాగలరు.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

4 comments:

  1. మొదటగా ధన్యవాదాలు ఒక మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు. ఈ పుస్తకం esnips.com లో download చేశాను. చాలా బాగుందనిపించింది. ఇక Land Mark లో కొనడమే తరువాయి. Laws సంగతేమోగానీ అనుబంధిత చారిత్రక విషయాలు మాత్రం నాకు నచ్చాయి. (దాదాపు) అన్నిటికీ reversal కూడా ఇచ్చి విచక్షణ పాటించమనడం బహుశా ఈ పుస్తకం ప్రత్యేకత అనుకుంటా.

    ReplyDelete
  2. చాలా మంచి పుస్తకాన్ని పరిచయం చెయ్యడమే కాకుండా సారాన్ని అందిస్తున్నారు. బాగుంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  3. శ్రీధర్ గారూ! మీ కామెంట్ కు ధన్యవాదాలు!

    ReplyDelete