Wednesday, May 1, 2019

జీవితమే ఒక అవకాశం



జీవితమే ఒక అవకాశం



జీవితమనేది అవకాశాల సమాహారం

అసలు జీవితమే ఒక అవకాశం


జీవితంలో అవకాశాలనేవి ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉంటాయి


వాటిలో ఏదో ఒకదానిని అందిపుచ్చుకోవడమనేది 90 శాతం విజయం


సాధ్యమైనంత ఉన్నతమైనదానిని అందుకోవడమనేది 10 శాతం విజయం మాత్రమే


ఉన్నతమైన లక్ష్యం కోసం ప్రయత్నించడం అభిలషణీయమే


కానీ దానిని అందుకోలేనపుడు జీవితమే చేజారినట్లుగా నిరాశలో కూరుకుపోతే ఆ తరువాత వచ్చే అవకాశాలను కూడా అకారణంగా చేజార్చుకుంటాము






Sunday, April 21, 2019

నెగెటివ్ థింకింగ్ కూడా అవసరమే!




నెగెటివ్ థింకింగ్ కూడా అవసరమే!



ఇంటికి తాళం వేయడం ఒక నెగెటివ్ థింకింగ్

తలకు హెల్మెట్ ఒక నెగెటివ్ థింకింగ్


ఓటు వేసిన వారి వేలిపై సిరాగుర్తు ఒక నెగెటివ్ థింకింగ్


దేశానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒక నెగెటివ్ థింకింగ్


సమాజంలో పోలీసు వ్యవస్థ ఒక నెగెటివ్ థింకింగ్


దేశానికి సైన్యం ఒక నెగెటివ్ థింకింగ్


టీకాలు వేయించుకోవడం ఒక నెగెటివ్ థింకింగ్


షాపింగ్ చేయడానికి వచ్చిన కస్టమర్లను చెక్ చేయడం ఒక నెగెటివ్ థింకింగ్


అసలు కీడెంచి మేలెంచమన్న పెద్దలమాటే ఒక నెగెటివ్ థింకింగ్


మరి ఇవేవీలేకుండా మనుగడ సాధ్యమా?.... 


....లేదు !


కనుక.... 


మనకు నెగెటివ్ థింకింగ్ కూడా అవసరమే!




POSITIVE THINKING



POSITIVE THINKING



రోడ్డు మీదకెళితే యాక్సిడెంట్ అవుతుందేమో! పేపర్లలో ఎన్ని చూడటంలేదు! 

ఇలా ఆలోచించి ఎవరూ ప్రయాణాలను మానుకోలేరు. 


మంచి జరుగుతుందనే Positive Thinking ఒక్కటే మనలను ముందుకు నడుపుతుంది.  


ఇలాంటి సందర్భాలలో మనం సురక్షితంగా ఉంటామనే గ్యారెంటీ ఎవరూ రాసివ్వరు. 


తగిన జాగ్రత్తలు తీసుకోవడం, మిగతాది వదిలేయడం. అంతే మనం చేయగలిగింది. 


ఇంట్లో గాస్ సిలిండర్ పేలవచ్చు అని దానిని వాడకుండా ఉండలేము. 


కరెంట్ షార్ట్ సర్క్యూట్ అవవచ్చు అని కరెంట్ లేకుండా ఉండలేము. 


సెల్ ఫోన్ పేలవచ్చు అని దానిని వాడకుండా ఉండలేము. 


కూతురు పెళ్ళి చేస్తే అత్తింటివారు హింసిస్తారని ఆమెకు పెళ్ళి చేయకుండా ఉండలేము.


బస్ ఎక్కితే అది ప్రమాదానికి గురవుతుందేమోనని దానిని ఎక్కకుండా ఉండలేము.

ఇంటిలో దొంగలు పడి మనకు హాని తలపెడతారేమో అని ఇంటిని వీడలేము.


ఇలాంటివన్నీ లోకంలో నిత్యం జరిగేవే. అయినా కూడా మనం ఆ పనులు చేయక తప్పదు.


Positive Thinking మాత్రమే ఇక్కడ మనకున్న ఒకే ఒక్క దారి.




Saturday, April 20, 2019

EXPECTATIONS vs REALITY




EXPECTATIONS vs REALITY


జీవితంలో జరిగే సంఘటనలు వాస్తవాలకు (Reality) అనుగుణంగా ఉంటాయి.

మనం ఆశించేది (Expectations) మాత్రం మన ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుంది. 


దీనినిబట్టి మనం గ్రహించవసినది ఏమిటంటే :


"మనం ఆశించేది వాస్తవ విరుద్ధంగా ఉంటే అది ఎన్నటికీ జరుగదు" అని.


ఆశలు, ఆకాంక్షలు అందరికీ ఉంటాయి. కానీ ఎవరి ఆశలు వాస్తవాలను అనుసరిస్తాయో వారి ఆకాంక్షలు మాత్రమే నెరవేరతాయి.


ఉదాహరణకు:


జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలనే ఆకాంక్ష ప్రతి ఒక్కరికీ ఉంటుంది.


కానీ క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడిపేవారు మాత్రమే జీవితంలో ఎదుగుతారు అనేది ఒక వాస్తవం.


అయితే ఇక్కడ ఎదగాలనే ఆకాంక్ష క్రమశిక్షణలేని వారికి కూడా ఉంటుంది. అయితే అది ఎప్పటికీ నెరవేరదు.


కనుక మన జీవితాలను వాస్తవాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలి.