ఆమె ఎక్కడ ఉంటే నీవూ అక్కడే ఉండు!
ఆమె పల్లకీలో విశ్రాంతిగా పడుకొని ప్రయాణించడం గనుక నీవు చూస్తే, యాదృచ్చికంగా తారసపడినట్లుగా ఆమెను సమీపించి, పరులెవ్వరికీ అర్థంకాని సంకేతభాషలో నీవు ఆమెకు చెప్పాలనుకున్నది చెప్పు.
ఆమె ఏదైనా ఒక విశాలమైన పోర్టికోక్రింద ఏమీ తోచక పచార్లు చేయడం గనుక నీవు గమనిస్తే, నీవు కూడా అక్కడకు పోయి తారట్లాడు:
కొన్నిసార్లు ఆమెను దాటి ముందుకెళ్ళిపో, మరికొన్నిసార్లు ఆమె వెనుకనే ఉండిపో;
ఒకసారి వేగంగా అడుగులు వేయి, మరొకసారి నెమ్మదిగా కదులు:
గుంపును విడిచి స్థంభాల మాటుగా ఆమె చెంతకు చేరి పక్కనే నడవడానికి సిగ్గుపడకు,:
ఆమె ఎంతో అందంగా ముస్తాబై వినోదమందిరానికి వెళ్ళినపుడు, నీవక్కడ లేని పరిస్థితిని ఎప్పుడూ రానీయకు.
ఆచ్ఛాదన లేని ఆమె భుజాలు తమ సౌందర్యాన్ని వీక్షించే భాగ్యాన్ని నీకు కలిగిస్తాయి:
అక్కడ ఆమెవంక చూడటానికి, ఆమెను ఆరాధించడానికి నీకు మంచి సమయం దొరుకుతుంది. కళ్ళతోనూ, సౌంజ్ఞలద్వారానూ ఆమెతో మాట్లాడవచ్చు.
నాటకంలో యువతి పాత్ర పోషించే వానిని చప్పట్లతో ప్రోత్సహించు, ప్రియుడి పాత్రధారుని అంతకన్నా ఎక్కువగా ప్రోత్సహించు:
ఆమె వెళ్ళిపోవడానికి లేచి నిలబడినట్లైతే నీవు కూడా లేచి నిలబడు, ఆమె కూర్చొని ఉన్నప్పుడు నీవూ కూర్చొనే ఉండు.
(ఆమె లేచి వెళ్ళిపోతే నీవు కూడా వెళ్ళిపో! ఆమె కూర్చుని ఉంటే మాత్రం నీవూ కూర్చునే ఉండు!)
సమయం గురించి చింతించకు, ఆమె చిత్తానుసారం ఎంత సమయమైనా వృధా చేసేయ్.
No comments:
Post a Comment