Thursday, January 15, 2009

Law 15 : శత్రువును కోలుకోనీయకు

CRUSH YOUR ENEMY TOTALLY

శత్రువును పూర్తిగా నాశనం చేయి


All great leaders since Moses have known that a feared enemy must be crushed completely. (Sometimes they have learned this the hard way.) If one ember is left alight, no matter how dimly it smolders, a fire will eventually break out. More is lost through stopping halfway than through total annihilation: The enemy will recover, and will seek revenge. Crush him, not only in body but in spirit.


మోషే కాలం నుండి కూడా గొప్ప నాయకులంతా దెబ్బతిన్న శత్రువును తిరిగి కోలుకోకుండా పూర్తిగా నాశనం చేయాలన్న విషయాన్ని తెలుసుకున్నారు. (ఒక్కోసారి వారు చాలా కష్టాలపాలైన మీదట ఈ విషయాన్ని గ్రహించారు) ఒక్క చిన్న నిప్పురవ్వ మిగిలున్నా అది నివురు కప్పుకుని ఉన్నా కూడా చివరికి అగ్నికీలలు రగులుకుంటాయి. పూర్తిగా నాశనం చేయకుండా, కొంత దెబ్బతీసి వదిలేస్తే చాలా కోల్పోవలసి ఉంటుంది. శత్రువు కోలుకుంటాడు, ప్రతీకారం తీర్చుకుంటాడు. అతడిని నలిపేయి, ఒక్క శరీరాన్నే కాదు.. స్ఫూర్తిని కూడా.

Image : నలిగిన పాము : నీ కాలి క్రింద నలిగిన పాము ప్రాణాలతో గనుక మిగిలితే అది ఉవ్వెత్తున లేచి కాటేసి నీ శరీరంలో రెండింతల విషాన్ని నింపుతుంది. వదిలివేయబడ్డ శత్రువు స్వయానా నీవే జవజీవాలిచ్చిన సగం చచ్చిన పాము లాంటివాడు. కాలం గడిచే కొలదీ ఆ పాము విషం మరింత తీవ్రమవుతూ ఉంటుంది.

Reversal : నీ శత్రువు తనంత తానే నాశనమయ్యే పరిస్థితిలో ఉంటే అతడినలానే వదిలేయి. ఆ సమయంలో నీవు దాడికి వెళితే అతను వేరే దారిలేక సర్వశక్తులూ కూడదీసుకుని నీతో చాలా తీవ్రంగా పోరాడతాడు. అప్పుడు నీకే ప్రమాదం ముంచుకురావచ్చు. తిరిగి కోలుకుని పోరాడగల అవకాశాలున్న శత్రువును మాత్రమే నాశనం చేయి.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

4 comments:

  1. " శత్రువును కోలుకోనీయకు
    స్నేహితుడిలా కనిపించు, గూఢచారిలా పనిచేయి
    సహాయం కావాలంటే ఆశలు కల్పించు, ప్రాధేయపడకు...
    నిజాయితీని, ఉదారతనూ ప్రదర్శించు
    ఇతరులు నీ మీద ఆధారపడేటట్లుగా చేయి
    దురదృష్టవంతులకు దూరంగా ఉండు"


    ఇవన్నీ విజయాన్ని సాధించగలవు అని నమ్మకమున్నా, ఎందుకో ఆమోదయోగ్యంగా అనిపించడంలేదు... ఇలాంటి ఎత్తులని నా మీద ప్రదర్శిస్తే అలాంటి వ్యక్తికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాను, మన వాతావరణంలో పెరిగిన చాలా మంది కూడా అలానే చెయ్యొచ్చు... జిత్తులుమారి అని, మోసగాడని,ఆపదలో ఆదుకోలేదని ఇలా రకరకాలుగా అనుకోవచ్చు... మన భారతీయ విలువల( అలా అని పోల్చవచ్చో లేదో మరి?) కి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది...

    నా సందేహాన్ని నివృత్తి చెయ్యగలిగితే దయ చేసి చెయ్యండి...

    ReplyDelete
  2. ఇది మినహాయించండి... "నిజాయితీని, ఉదారతనూ ప్రదర్శించు"

    ReplyDelete
  3. ప్రతి టపాలో ఇస్తున్న రెండు లింకులతో పాటు ఈ క్రింది లింకు మీ సందేహనివృత్తికి తోడ్పడగలవు.
    http://sudharmasabha.blogspot.com/2009/01/blog-post_10.html

    "నిజాయితీని, ఉదారతనూ ప్రదర్శించు"... దీనిని కూడా మినహాయించవలసిన పనిలేదు. ఎందుకంటే అది కూడా మిగతావాటి వంటిదే. ఆ నిజాయితీ, ఉదారత మన స్వలాభం కోసం కేవలం నటన మాత్రమే. "నిజాయితీని ఉదారతనూ నటించు" అని శీర్షిక పెడితే సరైన భావం స్పురించేది.:)

    ReplyDelete
  4. ఈ పుస్తకం రాసేప్పుడు అమెరికాలోనూ వీటిపై తీవ్రాతితీవ్రమైన నైతిక వ్యతిరేకత వచ్చింది. భారతీయ కాంటెక్స్ట్ మాత్రమే కాదు ప్రపంచంలో కూడా ఎప్పుడూ వీటిని ఎదిగే, ఎదిగిన వ్యక్తులు ప్రదర్శించడమే తప్ప ఎవరూ బయటకి చెప్పేవి కాదు. ఏ రంగంలోనైనా ఉన్నతస్థాయికి ఎదిగిన వారు చాలామందిలో కనీకనిపించని ఓ నిర్వేద రేఖ ఉంటుంది. అది జీవితంలోని ఈ కఠిన వాస్తవాలను దగ్గర నుంచి చూసినందునే. ఇవి నేర్వకపోవడం వల్ల మనం వీటిని ఎదుటివారు వాడితే కాసుకోవడం కూడా రాకపోవడంతో దెబ్బతినే ప్రమాదం ఉంది. అది నేర్వక అధ:పాతాళానికి పడిపోయినవారు ఎందరెందరో.. సినిమారంగంలో, రాజకీయాల్లో మరీ సుస్పష్టంగా కనిపిస్తారు. అందువల్ల వాడినా వాడకున్నా నేర్చుకో. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త

    ReplyDelete