Sunday, April 21, 2019

నెగెటివ్ థింకింగ్ కూడా అవసరమే!
నెగెటివ్ థింకింగ్ కూడా అవసరమే!ఇంటికి తాళం వేయడం ఒక నెగెటివ్ థింకింగ్

తలకు హెల్మెట్ ఒక నెగెటివ్ థింకింగ్

ఓటు వేసిన వారి వేలిపై సిరాగుర్తు ఒక నెగెటివ్ థింకింగ్

దేశానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒక నెగెటివ్ థింకింగ్

సమాజంలో పోలీసు వ్యవస్థ ఒక నెగెటివ్ థింకింగ్

దేశానికి సైన్యం ఒక నెగెటివ్ థింకింగ్

టీకాలు వేయించుకోవడం ఒక నెగెటివ్ థింకింగ్

షాపింగ్ చేయడానికి వచ్చిన కస్టమర్లను చెక్ చేయడం ఒక నెగెటివ్ థింకింగ్

అసలు కీడెంచి మేలెంచమన్న పెద్దలమాటే ఒక నెగెటివ్ థింకింగ్

మరి ఇవేవీలేకుండా మనుగడ సాధ్యమా?.... 

....లేదు !

కనుక.... 

మనకు నెగెటివ్ థింకింగ్ కూడా అవసరమే!POSITIVE THINKINGPOSITIVE THINKINGరోడ్డు మీదకెళితే యాక్సిడెంట్ అవుతుందేమో! పేపర్లలో ఎన్ని చూడటంలేదు! 

ఇలా ఆలోచించి ఎవరూ ప్రయాణాలను మానుకోలేరు. 

మంచి జరుగుతుందనే Positive Thinking ఒక్కటే మనలను ముందుకు నడుపుతుంది.  

ఇలాంటి సందర్భాలలో మనం సురక్షితంగా ఉంటామనే గ్యారెంటీ ఎవరూ రాసివ్వరు. 

తగిన జాగ్రత్తలు తీసుకోవడం, మిగతాది వదిలేయడం. అంతే మనం చేయగలిగింది. 

ఇంట్లో గాస్ సిలిండర్ పేలవచ్చు అని దానిని వాడకుండా ఉండలేము. 

కరెంట్ షార్ట్ సర్క్యూట్ అవవచ్చు అని కరెంట్ లేకుండా ఉండలేము. 

సెల్ ఫోన్ పేలవచ్చు అని దానిని వాడకుండా ఉండలేము. 

కూతురు పెళ్ళి చేస్తే అత్తింటివారు హింసిస్తారని ఆమెకు పెళ్ళి చేయకుండా ఉండలేము.

బస్ ఎక్కితే అది ప్రమాదానికి గురవుతుందేమోనని దానిని ఎక్కకుండా ఉండలేము.

ఇంటిలో దొంగలు పడి మనకు హాని తలపెడతారేమో అని ఇంటిని వీడలేము.

ఇలాంటివన్నీ లోకంలో నిత్యం జరిగేవే. అయినా కూడా మనం ఆ పనులు చేయక తప్పదు.

Positive Thinking మాత్రమే ఇక్కడ మనకున్న ఒకే ఒక్క దారి.Saturday, April 20, 2019

EXPECTATIONS vs REALITY
EXPECTATIONS vs REALITY


జీవితంలో జరిగే సంఘటనలు వాస్తవాలకు (Reality) అనుగుణంగా ఉంటాయి.

మనం ఆశించేది (Expectations) మాత్రం మన ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుంది. 

దీనినిబట్టి మనం గ్రహించవసినది ఏమిటంటే :

"మనం ఆశించేది వాస్తవ విరుద్ధంగా ఉంటే అది ఎన్నటికీ జరుగదు" అని.

ఆశలు, ఆకాంక్షలు అందరికీ ఉంటాయి. కానీ ఎవరి ఆశలు వాస్తవాలను అనుసరిస్తాయో వారి ఆకాంక్షలు మాత్రమే నెరవేరతాయి.

ఉదాహరణకు:

జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలనే ఆకాంక్ష ప్రతి ఒక్కరికీ ఉంటుంది.

కానీ క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడిపేవారు మాత్రమే జీవితంలో ఎదుగుతారు అనేది ఒక వాస్తవం.

అయితే ఇక్కడ ఎదగాలనే ఆకాంక్ష క్రమశిక్షణలేని వారికి కూడా ఉంటుంది. అయితే అది ఎప్పటికీ నెరవేరదు.

కనుక మన జీవితాలను వాస్తవాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలి.

Thursday, November 9, 2017

కుటుంబనావ
ప్రతి కుటుంబం డబ్బు సంపాదిస్తుంది
ప్రతి కుటుంబం పిల్లలను చదివిస్తుంది
ప్రతి కుటుంబం డబ్బు పొదుపు చేస్తుంది
ప్రతి కుటుంబం ఆస్తులు సమకూర్చుకొంటుంది
ప్రతి కుటుంబం బంధువులను ఆదరిస్తుంది
ప్రతి కుటుంబం స్నేహధర్మం పాటిస్తుంది 
ప్రతి కుటుంబం పెద్దల బాగోగులు చూస్తుంది
ప్రతి కుటుంబం ఖర్చులు చేస్తుంది
ప్రతి కుటుంబం అవసరాలకు అప్పు చేస్తుంది 
ప్రతి కుటుంబం ఖరీదైన ఆభరణాలను కొంటుంది
ప్రతి కుటుంబం విహారయాత్రలు చేస్తుంది
ప్రతి కుటుంబం పిల్లలను పెంచిపెద్ద చేస్తుంది
ప్రతి కుటుంబం దైవభక్తిని కలిగి ఉంటుంది
ప్రతి కుటుంబం పరువు ప్రతిష్ఠల కోసం పాకులాడుతుంది
ప్రతి కుటుంబం పంతాలు పట్టింపులకు పోతుంది 

ఈ పనులన్నీ ప్రతీ కుటుంబానికీ విధాయకమైనవే.

వీటన్నింటినీ ప్రతీ కుటుంబం సమతుల్యతతో నెరవేర్చడం ఆశించదగినదే. 

అయితే ఒక్కో కుటుంబం ఒక్కో పని మీద అధికంగా Focus పెడుతుంది. దానితో మిగతావి వెనకబడిపోయి కాలగమనంలో కుటుంబనావ చేరవలసిన తీరానికి చేరదు.

Wednesday, November 8, 2017

'రాజ్యం' అంటే

కొన్ని విలువలకు స్వీయ నియంత్రణతో కట్టుబడిన కొందరు వ్యక్తులు....... 

.......అటువంటి నియంత్రణలేని మిగతావారిని కూడా.......... 


...........ఆ విలువలకు కట్టుబడేటట్లు చేయడమే.........


...............
...'రాజ్యం'.   
Thursday, March 31, 2016

ప్రేమకళ- వేయి స్వభావాలకు, వేయి పథకాలు
వేయి స్వభావాలకు వేయి పథకాలు
మన మజిలీ దగ్గర పడింది. ఈలోపు నేను మీకు మరొక విషయం చెబుతాను.


స్త్రీలనేవాళ్ళు రకరకాల మనస్తత్వాలతో ఉంటారు. వేయి మనస్తత్వాలతో నీవు వేయి పద్దతులలో వ్యవహరించాలి. 


ఒకే నేలలో అన్ని పంటలూ బాగా పండవు. ఈ నేల ద్రాక్షకు తగినది, ఆ నేల ఆలివ్‌కు, ఇదిగో ఇక్కడ గోధుమ బాగా పండుతుంది.


ఎన్ని రకాల రూపాలు, ఎన్ని రకాల ముఖాలను నీవు కలుసుకుంటావో, ఈ ప్రపంచంలో అన్ని రకాల మనస్తత్వాలు ఉన్నట్లుగా నీవు గమనిస్తావు.


తెలివైనవాడు ఈ రకరకాల మనస్తత్వాలకూ, స్వభావాలకూ తగినట్లుగా తనను తాను ఎలా మలచుకోవాలో, సందర్భానికి తగినట్లుగా తన సంభాషణ ఎలా ఉండాలో తెలుసుకొని ఉంటాడు.


ప్రొటియస్ (60) ఒకసారి ఓ అందమైన నీటి అలగా, మరొకసారి ఓ సింహంగా, మరోసారి ఓ చెట్టుగా, మరోసారి గుర్రుమనే ఓ ఎలుగుబంటిగా తనను తాను మార్చుకుంటాడు.


చేపను పట్టే విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. కొన్నింటిని బల్లెంతో గుచ్చి పట్టుకుంటావు, కొన్నింటిని గాలం వేసి పట్టుకుంటావు, మరికొన్నింటిని వలలో బంధించి పట్టుకుంటావు.  


రకరకాల మనుషులకు, రకరకాల పద్దతులు తగిన విధంగా ఉంటాయి.


నీ ప్రియురాలి వయసును బట్టి కూడా నీవు వాటిని మార్చవలసి ఉంటుంది. (61) వయసు మీరిన దుప్పి నీ కుట్రలను దూరం నుండే గ్రహిస్తుంది.

అమాయకురాలి వద్ద మితిమీరిన తెలివితేటలను, బిడియస్తురాలి వద్ద మితిమీరిన దూకుడును ప్రదర్శిస్తే, ఆమె ఆత్మవిశ్వాసం కోల్పోయి, భయంతో నీకు దూరంగా ఉండిపోతుంది.


ఈ కారణం చేతనే ఒక సంస్కారవంతుడైన పురుషుడి కౌగిలిలోకి రావడానికి భయపడిన స్త్రీ, ఒక పనికిమాలిన వెధవ చేతులలో వాలిపోవటం అనేది ఒక్కోసారి జరుగుతుంది.


నేను చేపట్టినకార్యంలో కొంత భాగం మిగిలిపోయింది, కొంత భాగం పూర్తయింది. ఇక ఇక్కడ మన నావకు (62)లంగరు వేసి, ఒకింత విశ్రాంతి తీసుకుందాం.
Footnote:


(60) గ్రీకు పురాణాలలో ప్రొటియస్ ఒక సముద్ర దేవుడు. ఇతడు తన రూపాన్ని కావలసినట్లుగా మార్చుకోగలడు.


(61) వయసు, అనుభవం ఉన్న ప్రౌఢకాంత, తనను లోబరుచుకోవడానికి నీవు వేసే ఎత్తుగడలను, సులభంగా గ్రహిస్తుందని అర్థం.


(62) ఒక ప్రేమికుడు ప్రేమవ్యవహారంలో క్రమంగా ముందుకెళ్ళడాన్నీ, తాను ‘ప్రేమకళ’ను బోధించడాన్నీ రెంటినీ ఒవిడ్ నౌకాయానంతో పోల్చాడు. ఒక్కోసారి రథయాత్రతోకూడా పోల్చాడు.

‘ప్రేమకళ’ మొదటి భాగం సమాప్తం
ప్రేమకళ- స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండు!స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండు!మంచి చుట్టూ చెడు అల్లుకుపోయి ఉందని నేను విచారంతో ఎలుగెత్తి అరవనా? లేక కేవలం నిన్ను హెచ్చరించనా?


స్నేహం, విశ్వాసపాత్రత అనేవి రెండూ డొల్ల మాటలు.


నీవు గాఢంగా ప్రేమించే స్త్రీ లోని ఆకర్షణల గురించి నీ స్నేహితుడికి చెప్పటం అంత మంచిది కాదు. నీవు ఆమె గురించి చెప్పినదంతా అతడు నిజమని నమ్మిన పక్షంలో, వెంటనే అతడు నీకు ప్రత్యర్థిగా మారిపోతాడు.


అయితే నీవిలా వాదించవచ్చు:


పాట్రోక్లస్ (56) అచెల్లిస్ పానుపునెప్పుడూ మలినం చేయలేదు.


(పాట్రోక్లస్, అచెల్లిస్‌కెప్పుడూ ద్రోహం చేయలేదు)


ఫేడ్రా, పిరిథోస్ (57) విషయంలో మాత్రం ఎటువంటి తప్పూ చేయలేదు.


పైలేడ్స్, హెర్మియోన్‌ని (58) ప్రేమించాడు, అయితే అది (59) అపోలోకు ఎథీనా మీద ఉన్న ప్రేమ లాంటిది,  లేదా అది కవల సోదరులైన కాస్టర్, పొల్లక్స్‌లకు తమ తోబుట్టువైన హెలెన్ మీద ఉన్న ప్రేమ లాంటిది.


అటువంటి అద్భుతాలు జరుగుతాయని నీవు ఆశిస్తుంటే, పూపొద నుండి ఆపిల్‌పళ్ళను కోయాలనీ, నదీప్రవాహం మధ్యన తేనెను సేకరించాలని కూడా ఆశించు!


చెడు అనేది మనిషిని త్వరగా ఆకర్షిస్తుంది. అలానే, ప్రతిమనిషీ తన స్వీయసంతోషాన్నే చూసుకుంటాడు. అంతేకాక మరొకరు బాధపడటం ద్వారా పొందిన సంతోషం మరింత తీయగా ఉంటుంది.


ఆ! ఎంత దిగ్భ్రాంతికరం! ప్రేమికులు ఎక్కువగా భయపడవలసినది తమ ప్రత్యర్థుల గురించి కాదు, స్నేహితుల గురించే.


కనుక ‘నమ్మదగిన మనుషులు’ అని నీవు అనుకునే వారందరికీ దూరంగా ఉంటే, నీవు సురక్షితంగా ఉంటావు!


ఈవిధంగా చుట్టం, సోదరుడు, ప్రాణమిత్రుడు లాంటి వారందరి విషయంలో జాగ్రత్తగా ఉండు! సాధారణంగా నిన్ను ఇక్కట్లపాలు చేసే వ్యక్తులు వీరే!
Footnote:


(56) పాట్రోక్లస్, అచెల్లిస్ ఇరువురూ ప్రాణస్నేహితులు


(57) పిరిథోస్, ఫేడ్రా భర్త అయిన థెసియస్‌కు మిత్రుడు


(58) పైలేడ్స్, హెర్మియోన్ భర్త అయిన ఒరెస్టెస్‌కు మిత్రుడు


(59) అపోలోకు ఎథీనా సోదరి