Tuesday, January 13, 2009

Law 8 : ఎరవేసి రప్పించు

MAKE OTHER PEOPLE COME TO YOU—USE BAIT IF NECESSARY

ప్రత్యర్ధిని నీవద్దకు రప్పించు--అవసరమైతే ఎరవేయి


When you force the other person to act, you are the one in control. It is always better to make your opponent come to you, abandoning his own plans in the process. Lure him with fabulous gains—then attack. You hold the cards.


నీ ప్రత్యర్థి తప్పటడుగు వేసేటట్లుగా నీవు గనుక పురికొల్పగలిగితే మొత్తం పరిస్థితి నీ నియంత్రణలోకి వస్తుంది. నీ ప్రత్యర్ధి తన ప్రణాళికలోని అన్ని పథకాలను వదిలేసి నీ వద్దకు వచ్చేటట్లుగా చేయి. అతనికి అనేక లాభాలున్నట్లుగా ఊరించి, ఆపై దాడి చేయి. నీది పైచేయి అవుతుంది.

Image : The Honeyed Bear Trap (ఎలుగుబంటి-తేనెఉచ్చు) : వేటగాడు ఎలుగుబంటిని వెంటాడడు. ఎందుకంటే ఎలుగుబంటిని వెంటాడి పట్టుకోవడం దాదాపూ అసాధ్యమేకాక పారిపోయేదారి లేనపుడు అది చాలా క్రూరంగా ఎదురుదాడి చేస్తుంది. అందువలన వేటగాడు దానిని వెంటాడటం బదులుగా తేనెతో ఎరవేసి ఉచ్చు పన్నుతాడు. దానిని వెంటాడుతూ అలసిపోవడం, ప్రమాదానికి సిద్ధపడటం లాంటివేమీ చేయడు. కేవలం ఎరవేస్తాడు. తదుపరి వేచి ఉంటాడు.

Reversal : ప్రత్యర్ధిని నీవద్దకు రప్పించడం కాకుండా నీవే హఠాత్తుగా నీ ప్రత్యర్ధిమీద దాడి చేయడం ద్వారా కూడా ఓడించవచ్చు. సందర్భాన్ని బట్టి నడచుకోవాలి.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

3 comments:

  1. అన్నట్టు, ఇలాంటి దాడి మన మీద జరిగినప్పుడు మనం ఏమి చెయ్యాలి అన్నది ఏ పుస్తకం లో ఐనా వివరించారా?

    ReplyDelete
  2. The 33 Strategies of War అనే పుస్తకంలో వివరించారు.

    అరుణ గారూ! ఇదంతా మీకు అన్యాయంగా అనిపిస్తుండవచ్చు. కానీ ఇదంతా వాస్తవం. దున్నేవాడిదే భూమి అన్నట్లుగా బలం ఉన్నవాడిదే రాజ్యం! వీరభోజ్యా వసుంధర!

    వేటాడు! లేదంటే వేటాడబడతావు! తలతియ్యి! లేదంటే నీ తల తియ్య బడుతుంది! కంఫర్ట్‌జోన్‌లో బ్రతికే మనలాంటి వాళ్ళకు ఇదంతా విడ్డూరంగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి పవర్ జోన్ లోకి అడుగుపెడితే ఇదంతా సర్వసాధారణంగా మారిపోతుంది. లేదంటే మనం అక్కడ ఇమడలేము. ఏం చేస్తాం! లోకం అలా తగలడింది!

    అన్నట్లు, ఇంతకు ముందు మీరు చేసిన కామెంట్ కు సమాధానం ఇచ్చాను.

    ధన్యవాదాలు!

    ReplyDelete
  3. Nonsence...
    Don't follow this...It is a Bing Nonsence blog...

    ReplyDelete