Tuesday, January 13, 2009

Law 6 : చుక్కల్లో చంద్రుడులా వెలుగొందు

COURT ATTENTION AT ALL COST

అందరి దృష్టినీ ఆకట్టుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నించు


Everything is judged by its appearance; what is unseen counts for nothing. Never let yourself get lost in the crowd, then, or buried in oblivion. Stand out. Be conspicuous, at all cost. Make yourself a magnet of attention by appearing larger, more colorful, more mysterious than the bland and timid masses.


ప్రతిదాని విలువా అది కనబడే విధానాన్ని బట్టే నిర్ణయించబడుతుంది. కనపడని దానిని ఎవరూ లెక్కలోకి తీసుకోరు. ఏ ప్రత్యేక గుర్తింపు లేకుండా ఎప్పుడూ గుంపులో కలసిపోకు. ఎందుకంటే గుంపులో గోవిందయ్యలను ఎవరూ పట్టించుకోరు. ఎల్లప్పుడూ ప్రత్యేకంగా కనిపించు. ఎవరి దృష్టినైనా తటాలున ఆకర్షించేటట్లుగా ఉండటానికి అన్నివిధాలుగా ప్రయత్నించు. ఆకట్టుకునే శక్తిలేని మందలోమనిషిలా కాకుండా తళుకు బెళుకులతో, డాబుదర్పాలతో, ఓ పట్టాన అర్థంకాని వ్యక్తిలా ప్రవర్తిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించే ఓ సూదంటురాయిలా నిన్నునువ్వు మార్చుకో!

Image : The Limelight : (రంగస్థలం అంతా చీకటిగా ఉన్నఫుడు ఒకేఒక చోట ఫోకస్ చేసే సన్నని లైట్‌ను Limelight అంటారు) స్టేజ్ మీద Limelight ను ఏ నటుడి మీదకు ఫోకస్ చేస్తే ఆ నటుడే అందరికీ కనపడతాడు. అందరి కళ్ళూ అతని మీదే ఉంటాయి. Limelight యొక్క సన్నని వెలుగులో ఎప్పుడూ ఒక నటుడు మాత్రమే ఉండగలడు. ఆ కాంతి నీమీద ఫోకస్ చేయబడటానికి ఎలాగైనా ప్రయత్నించు. నీ నటన, హావభావాలు ఆకట్టుకొనే విధంగా ఉన్నట్లైతే ఆ Limelight ఎప్పుడూ నీమీదికే ఫోకస్ చేయబడుతుంది. దానితో అందరికీ నీవొక్కడివి మాత్రమే కనబడతావు. మిగతా నటులంతా చీకట్లోనే ఉండిపోతారు.

Reversal : సాధారణమైన ప్రజలముందే తప్ప శక్తివంతులముందు ఎప్పుడూ కూడా వెలుగొందాలని ప్రయత్నించకు. వారు ఆగ్రహిస్తే ప్రమాదంలో పడతావు. వారి సమక్షంలో నీవు తెరచాటుకు వెళ్ళిపో!


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

2 comments:

  1. చదవనా వద్దా అనే సంశయం పీడిస్తోంది. ఒక సారి చదివాక ఇక ఎవరన్నా తెలిసో తెలియకో ఇందులోని పనులు చేస్తే ఇక అనుమానిత ధృక్కులతో చూడాలి. నేనుగా ఆచరించేది... అసలు ఒక ఆర్గనైజేషను అనేది వుంటే అది బేస్ అయ్యే ప్రాధమిక అంశాలు ఏమిటి. వాటిని అందరూ ఎంతవరకు పాటిస్తున్నారు? ఇక ఒక వ్యక్తి ని అంచనా వెయ్యాలి అంటే మాట తీరు, మాటల్లో విజ్ఞానం, బాడీ లాంగ్వేజి. ఇంకొంచం లోతుల్లో కి వెళితే చదువు, background , అతను /ఆమె పాటించే జీవన విధానం లాంటివి. కాకపోతే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వీటిల్లో కొన్ని అంశాలని రోజూ తప్పనిసరిగా follow అవుతున్నారు కాబట్టి,
    కొంచం పరిశీలన అవసరం ఒక అభిప్రాయానికి వచ్చేముందు.

    ఇక ఒకసారి ఎదుటి వ్యక్తి కొంచం అర్ధం అయ్యాక వ్యక్తి ని బట్టీ, వాళ్ళు మన దగ్గర నుండి ఏమి ఆశిస్తున్నారు అన్నదాన్ని బట్టి వాళ్ళతో ప్రవర్తిచవలసిన పధ్ధతులు మనకు గా బుఱ్ఱలో మెరుస్తాయి. ఇవన్నీ కొద్ది రోజుల పరిశీలన, వివేచన, సమయస్ఫూర్తి తో అబ్బుతాయి. మరి ఇవన్నీ తెలిశాక, ఈ శక్తి ని మంచి పనుల కోసం అంటే పది మందికి వుపయోగపడే పనుల కోసం చెయ్యటం లో వుపయోగించాలి. అలా చెయ్యకుండా సొంత లాభం కోసం అధికారాన్ని వుపయోగించటం ఎలానో ఇక్కడ గ్రంధం లో చెప్పబడ్డాయి.

    ఏమో, విలన్ ఎంత వెధవో తెల్సుకోవటం వల్ల వచ్చేది ఏముంది. దేవుడి గుణగణాలు తెల్సుకుంటే విలనీ సులభం గా అర్ధం అవుతుంది. ఆ తర్వాత విలన్ని మట్టుబెట్టటం చాలా సులభం. కాకపోతే అందరు విలన్లే అయినప్పుడు ఎంత మందిని అని మట్టుబెట్టగలం.ఈ రోజుల్లో అసలు సమస్య అదే.

    ఎన్ని తర్జనభర్జనలు పడ్డా పుస్తకం చదవాలో వద్దో అర్ధం కావట్లే. కాకపోతే మీరు రాసే పొస్టులు మాత్రం సూపర్. ఇవి మాత్రం మిస్ అవ్వకుండా చదువుతా. :)

    ReplyDelete
  2. అరుణ గారూ! ఇది మంచి చెడుల సమస్యకాదు. What gets us the power and when we loose it అన్న ప్రాతిపదిక మీదే ఈ పుస్తకం రాయబడింది. అది మంచీ కావచ్చూ లేదంటే చెడూ కావచ్చు. నైతిక దృష్టితోకాక వీటిని వాస్తవ దృష్టితో పరిశీలించాలి. ఈ బుక్ చదివేటపుడు నేను కూడా చాలా షాక్‌కు గురయ్యాను.

    చిన్నప్పుడు మనం పంచతంత్ర కథలు నేర్చుకున్నాం. అటువంటివే ఇవి కూడా. మీరన్నట్లుగా స్వీయానుభవం తో ఎవరెటువంటివారో తెలుసుకుని మసలుకోవచ్చు. కానీ ఆ గ్రాస్పింగ్ పవర్ లేనివారికి ఈ పుస్తకం ఉపయోగకరం కావచ్చు.

    “దేవుడి గుణగణాలు తెలుసుకుంటే విలనీ సులభంగా అర్థం అవుతుంది.” ఇది పొరపాటు. విలనీని అర్థం చేసుకోవాలంటే దానినే అధ్యయనం చెయ్యాలి. (దేవుడి పేరుతో) మనం ఆ అధ్యయనాన్ని నిరాకరించిన కొలదీ విలన్లకు మనం మరింత ఈజీ టార్గెట్లుగా మారే ప్రమాదం ఉంటుంది. విలన్ చాలా తెలివైన వాడు. ఎందుకంటే అతని పని ఎప్పుడూ మోసం చేయడమే కాబట్టి ఆ విషయంలో అతను బాగా కృషి చేసి ఉంటాడు. మన అంచనాలకు అంత తేలికగా అందకపోవచ్చు.

    నిజమే! ఈ గ్రంథంలోని వివరణ మన శక్తిని స్వంతలాభం కోసం ఉపయోగించమని బోధిస్తుంది. కానీ మనం అలానే ఎందుకు చేయాలి? మీరు కోరుకున్నట్లుగానే పదిమందికీ ఉపయోగపడే విధంగానూ వాడుకోవచ్చు. ఎలా వాడాలన్నది మన ఇష్టం. రచయిత బోధించినట్లే చేయాలనేం లేదు. కానీ మంచిగా వాడాలన్న, చెడుగా వాడాలన్నా ముందు ఆ శక్తి మనకుండాలిగదా! మనకు అదంతా తెలిసుండాలిగదా!

    ఈ టపాలలో నేను పరిచయం చేస్తున్నది గోరంత. పుస్తకంలో ఉన్నది కొండంత. ఆవివరణంతా చదువుతుంటే మీ అభిప్రాయం మారవచ్చు. పుస్తకం చదవాలో వద్దో నెమ్మదిగా నిర్ణయించుకోండి. అది మార్కెట్లో ఎప్పుడైనా దొరుకుతుంది.

    అమాయక సగటు భారతీయులు నమ్మే కొన్ని విలువలకు కౌంటర్ గానే నేనీ టపాలను రాస్తున్నాను. అలా అని వారంతా ఒక్కసారిగా కన్నింగ్‌గా మారిపోవాలని కాదు. తమ అమాయకత్వాన్ని కొంతైనా వదులుకోవాలని మాత్రమే నా ఆకాంక్ష.

    ఈ పోస్టులు నచ్చినందుకు ధన్యవాదాలు!

    ReplyDelete