Sunday, June 9, 2013

'చెస్టర్‌ఫీల్డ్ సలహాలు '-మనవి


(PREPARATORY NOTE)



పైన తెలిపిన గ్రంథం గురించి కొన్ని ముఖ్య విషయాలను మీకు మనవి చేయాలనుకుంటున్నాను. అవి :—


• చెస్టర్‌ఫీల్డ్ బోధించిన విషయాలను తెలుగులోకి అనువదించి చదవడం కన్నా ఆయన రాసిన సుందరమైన ఆంగ్ల భాషలో చదివడమే ఉత్తమం. అందుకే ఈ గ్రంథాన్ని అనువదించే ప్రయత్నం చేయలేదు.


• ఈ గ్రంథంలోని ఆంగ్లభాష మన సగటు విద్యార్థికి అర్థమయ్యే స్థాయికన్నా కొంచెం హెచ్చుగా ఉంటుంది. అయితే గ్రంథాన్ని పఠించే సమయంలో భాషలోని తీయదనం అనుభుతిలోనికి వచ్చి ఆ లోటును పెద్దగా తెలియనీయదు. అంతేకాక చదివేకొలదీ క్రమంగా చెస్టర్‌ఫీల్డ్ శైలి మీద అవగాహన కలిగి మనకు విషయం తేటతెల్లమవుతుంది. ఆ విధంగా మన ఆంగ్ల భాషాప్రావీణ్యం కూడా కొంచెం పెరుగుతుంది.


• చెస్టర్‌ఫీల్డ్ తన ఉత్తరాలలో ఫ్రెంచ్ పదాలను తరచుగా వాడేవారు. కొన్ని భావాలను వెల్లడించడానికి ఆంగ్ల పదాల కన్నా ఫ్రెంచ్ పదాలే ఎక్కువ అనుకూలంగా ఉంటాయని ఆయన భావించడం దీనికి కారణం కావచ్చు. ఈ గ్రంథంలో కూడా మీకు కొన్ని ఫ్రెంచ్ పదాలు కనిపిస్తాయి. గ్రంథాన్ని పఠించే సమయంలో వాక్యాల మధ్యలో హఠాత్తుగా తటస్థపడే ఆ పదాలతో—సందర్భాన్ని బట్టి అవి అర్థమైనా, కాకపోయినా—పాఠకులకేమీ ఇబ్బంది ఉండదని భావిస్తున్నాను. (కొన్ని పదాలకు అర్థాలను గ్రంథం చివర అనుబంధంలో పొందుపరిచాను.)


• ఇంతకు ముందే చెప్పినట్లుగా చెస్టర్‌ఫీల్డ్ రాసిన ఉత్తరాలు తన కొడుకును ఉద్దేశించి ఆంతరంగికంగా రాసినవి కనుక ఆయన బోధన కేవలం పురుషులనే ఉద్దేశించినట్లు కనపడుతుంది. కానీ ఆయన బోధించిన విషయాలు లింగబేధం లేకుండా ఎవరైనా ఆచరించదగినటువంటివి.


ఈ విషయాలన్నింటినీ పాఠకులు గమనించగలరు.



—బి. యల్. సరస్వతీ కుమార్


 

No comments:

Post a Comment