ఆకట్టుకునేటట్లు కనబడు!
నీ జుట్టును ఉంగరాలు తిప్పాలని చూడకు,
గరుకైన ప్యూమిస్ ఱాయితో నీ కాళ్ళను రుద్దకు,
ఇటువంటి సోకులను –ఫ్రిజియన్ మంత్రాలను బిగ్గరగా వల్లిస్తూ, దేవతలకు తల్లైన సిబిలెను పూజించే– షోకిల్లారాయుళ్ళైన
పూజారులకు వదిలివేయి.:
నిర్లక్ష్యానికి గురైనపుడే పురుషసౌందర్యం
ఇనుమడిస్తుంది.
థెసియస్ తన కేశసౌందర్యం గురించి ఎటువంటి శ్రద్ధా
వహించకనే ఎరియాడ్నేను గెలుచుకున్నాడు:
ఫేడ్ర హిప్పోలైటస్‌ను ప్రేమించింది. అతనేమీ
సోగ్గాడు కాదు.
అడవిలో నివసించే అడోనిస్ ఒక దేవతకు ఆరాధ్యుడయ్యాడు.
ఐతే పరిశుభ్రత మీద మాత్రం దృష్టి పెట్టు,
వ్యాయామం చేయి,
నీ చర్మానికి బహిరంగ ప్రదేశంలో సూర్యకాంతిని
తగలనీయి:
చక్కగా సరిపోయే బట్టలను ధరించు, వాటిమీద మరకలేవీ లేకుండా జాగ్రత్తపడు,
నాలుకను శుభ్రంగా ఉంచుకో! పళ్ళకు గార పట్టనీయకు!
చేతకాని maమంగలి నీ జుట్టు అందాన్ని చెడగొడతాడు.
నిపుణుడైన వాడి చేత నీ తలవెంట్రుకలను, గడ్డాన్ని ట్రిమ్ చేయించుకో!
నీ గోళ్ళు చక్కగా కత్తిరించి ఉండాలి, వాటిలో మురికి చేరిలేకుండా శుభ్రంగా ఉండాలి.
ముక్కు రంధ్రాలలోనుండి వెంట్రుకలు బయటకు పెరిగి
ఉండకూడదు.
నీ నోటినుండి దుర్గంధపూరితమైన శ్వాస వెలువడకుండా
జాగ్రత్తపడు,
మేకపోతువలే శరీరంనుండి దుర్వాసన వెదజల్లుతూ ఇతరుల ముక్కుపుటాలను అదరగొట్టకు.
No comments:
Post a Comment