ఆమెను ఎలా ఎంచుకోవాలి?!
జీవితపు బరువుబాధ్యతలు ఇంకా నీ నెత్తిన పడకముందే, నీవు స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నప్పుడే "నా
మనసు దోచుకున్న మగువ నీవొక్కతవే" అని నీవు పలకదగిన ఒక స్త్రీని ఎంచుకోవాలి.
ఆమె నీ కోసం గాల్లో తేలుతూ స్వర్గంనుండి దిగిరాదు:
నీవు తప్పనిసరిగా స్వంత కళ్ళను ఉపయోగించి సరైన యువతిని వెదకి
పట్టుకోవాలి.
పోతుదుప్పిని పట్టుకోవడానికి ఉచ్చు ఎక్కడ పన్నాలో వేటగాడికి
తెలుసు,
కోపంతో పళ్ళు నూరే అడవిపంది విశ్రమించి ఉండే ప్రదేశం
ఏ లోయలో ఉంటుందో అతనికి తెలుసు:
అడవి పక్షులను పట్టుకునేవాడికి అవి ఏ చిట్టడవి గుబురులలో
దొరుకుతాయో తెలుసు:
బెస్తవాడికి ఏ జలరాశిలో చేపలు సమృద్ధిగా ఉంటాయో తెలుసు:
అజరామరమైన ప్రేమకొరకు తగినవ్యక్తి కోసం గాలించే నీవు
కూడా,
యువతులు ఎక్కువగా తిరుగాడే
ప్రదేశాలగురించి తప్పకుండా తెలుసుకోవాలి.
నీవు సముద్రయానాలు చేసి వారిని వెదకాలనిగానీ, రహదారులవెంట సుదూరంగా ప్రయాణించి వారిని కనుగొనాలనిగానీ నేను
కోరను.
పెర్సియస్ ఆండ్రోమెడాను శరీరవర్ణం నల్లగా ఉండే ఇండియా (ఇథియోపియా) నుండి తెచ్చుకుంటే తెచ్చుకున్నాడు,
ట్రోజన్ వీరుడు పారిస్ హెలెన్‌ను గ్రీసుదేశం నుండి చెరబట్టి
ఎత్తుకొస్తే ఎత్తుకొచ్చాడు,
అటువంటి సౌందర్యవతులు ఎందరో మీకు రోమ్‌లోనే దొరుకుతారు, మీరు వారిని చూస్తే ప్రపంచంలోని అందమంతా ఇక్కడే ఉంది అని అనక
మానరు.’
గార్గారా పర్వతం మీద ఎన్ని ధాన్యపు కంకులున్నాయో,
మెథిమ్నా ప్రాంతంలో ఎన్ని ద్రాక్ష పండ్లు కాస్తాయో,
సముద్రంలో ఎన్ని చేపలుంటాయో,
అడవిలోని చెట్లకొమ్మలమీద ఎన్ని పక్షులుంటాయో,
ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయో
అంతమంది అందమైన యువతులు నీ రోమ్ నగరంలోనే ఉంటారు:
ప్రేమదేవత అయిన వీనస్ కూడా తన కొడుకైన ఏనియస్‌కు (3) చెందిన రోమ్ నగరాన్నే
తన సామ్రాజ్యానికి రాజధానిగా చేసుకున్నది
ఇంకా యవ్వనంలోకి అడుగిడని పసివయసులో ఉన్నవారిని నీవు కోరుకుంటే
నీ కళ్ళముందుకు ఒక అనుభవంలేని, అమాయకమైన బాలిక వస్తుంది:
నీవు యవ్వనవతిని గనుక కోరుకుంటే అటువంటివారు వేలమంది నీ మనసును
ఆకట్టుకుంటారు. వారిలో ఎవ్వరిని ఎంచుకోవాలో కూడా తెలియక నీవు ఉక్కిరిబిక్కిరి
అయిపోతావు:
అలాకక నీవు మరింత వయసు, మరింత అనుభవం ఉన్న ప్రౌఢను గనుక కోరుకుంటే —నన్ను నమ్ము— అటువంటి వారు కూడా మరింత ఎక్కువమంది ఉంటారు.
Footnote:
(3) వీనస్‌కు మరో కొడుకైన ఏనియస్ సంతతే రోమ్ నగర స్థాపకులు.
No comments:
Post a Comment