ముందుమాట
ఒవిడ్‌కు గ్రీకు, రోమన్ పురాణాలకు సంబంధించి చాలా లోతైన పరిజ్ఞానం ఉంది. ఆయన కవితలలో అడుగడుగునా ఆ పురాణఘట్టాల ప్రస్తావన దొర్లుతూ ఉంటుంది. ఈ కారణంగానే ఒవిడ్ శైలి గండశిలకన్నా కఠినంగా ఉంటుంది. కానీ చదివి అర్థంచేసుకునే కొలదీ అది గండచక్కెర కన్నా తీయగా ఉంటుంది. మరి అలా అర్థం చేసుకోవాలంటే ఆ పురాణాలకు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. అలా లేనివారు ఎప్పటి కప్పుడు రిఫరెన్సులు చూసుకుంటుండాలి. అందుకే అవసరమైన ప్రతీచోటా వివరణలను (footnote) పొందుపరిచాను.
ఒవిడ్ ప్రేమ కవితలను చరిత్రలో అనేక మంది ఆంగ్లపండితులు లాటిన్‌నుండి ఆంగ్లంలోకి అనువదించారు. వీరంతా కూడా ‘అర్స్ అమటోరియా’ గ్రంథాన్ని ‘The Art of Love’ పేరుతోనే అనువదించారు. వీరిలో ఎక్కువమంది లాటిన్‌లో ఒవిడ్ అనుసరించిన పద్యశైలినే తమ అనువాదంలో కూడా అనుసరించారు. కానీ లూయిస్ మే (Lewis May) మాత్రం పద్యశైలికి తోడుగా కొంచెం గద్యశైలిని కూడా ఉపయోగించాడు.
పూర్తిగా వచనశైలిలోనే చేయబడిన ఈ ఆంధ్రానువాదం లూయిస్ మే ఆంగ్లానువాదం నుండి చేయబడింది.
–బి.యల్.సరస్వతీ కుమార్
No comments:
Post a Comment