Sunday, January 18, 2009

Law 27 : ప్రజలను నమ్మించి లభ్దిపొందు

PLAY ON PEOPLE’S NEED TO BELIEVE TO CREATE A CULTLIKE FOLLOWING

ప్రజల యొక్క నమ్మేగుణం ద్వారా, ఆరాధించే అనుచరగణాన్ని తయారు చేసుకో


People have an overwhelming desire to believe in something. Become the focal point of such desire by offering them a cause, a new faith to follow. Keep your words vague but full of promise; emphasize enthusiasm over rationality and clear thinking. Give your new disciples rituals to perform, ask them to make sacrifices on your behalf. In the absence of organized religion and grand causes, your new belief system will bring you untold power.


ఏదో ఒకదానిలో నమ్మకాన్ని కలిగి ఉండాలనే ప్రబలమైన కోరిక ప్రజలకుంటుంది. ప్రజలకు ఓ ఉద్దేశ్యాన్ని, వారు అనుసరించడానికి ఒక కొత్త విశ్వాసాన్ని అందించడం ద్వారా అటువంటి కోరికకు కేంద్రబిందువుగా మారు. నీమాటలు ఇతిమిథ్థంగా ఉండకూడదు ..కానీ ఆశలు కల్పించేటట్లుగా ఉండాలి. యోచనలో స్పష్టత, తార్కికత తగ్గేంతగా ఉత్సుకతను పెంచాలి. నీ కొత్త శిష్యులు ఆచరించటానికి సంస్కారాలను రూపొందించి ఇవ్వు. నీతరపున త్యాగాలు చేయమని వారికి పిలుపునివ్వు. మరే ఉన్నతమైన ఉద్దేశ్యాలూ, మరే వ్యవస్థీకృత సిద్ధాంతమూ లేకపోవడంతో నీ కొత్త విశ్వాసపద్దతి నీకు చెప్పలేనంత శక్తిని తెచ్చిపెడుతుంది.

Image : అయస్కాంతం : కనబడని బలమొకటి వస్తువులను దీనివైపు లాగటంతో, ఆ వస్తువువులన్నీ కూడా అయస్కాంతబలాన్ని పొంది, తిరిగి మిగతా భాగాలను తమవైపు లాగడంతో మొత్తం అయస్కాంత శక్తి క్రమంగా పెరుగుతూ ఉంటుంది. అసలు అయస్కాంతాన్ని తొలగిస్తే ప్రభావమంతా పోతుంది. ప్రజల ఊహలను ఆకర్షించి, వారందరినీ కలిపిఉంచే కనపడనిబలంగా ఉండే అయస్కాంతంగా నీవు మారు. వారు నీ చుట్టూ గుంపు కట్టిన తరువాత ఏ శక్తీ నీనుండి వారిని దూరంగా లాగివేయలేదు.

Reversal : ఒక వ్యక్తిని మోసం చేయడం కష్టం. కానీ మోసం బయటపడితే పరిస్థితిని ఎదుర్కోవడం తేలిక. ఒక గుంపును మోసం చేయడం చాలా సులభం. కానీ మోసం బయటపడితే మాత్రం పరిస్థితిని ఎదుర్కోవడం చాలా కష్టం. వాళ్ళంతా కలసి నిన్ను ముక్కలు ముక్కలు చేసేస్తారు. కాబట్టి గుంపును డీల్ చేసేటపుడు ఎవరైనా నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారా.. అని ఎప్పుడూ నిఘా పెట్టిఉంచు. నీ మూటాముల్లె ఎప్పుడూ సర్దుకునే ఉండు. ఒకవేళ నీసంగతి బయటపడితే, ఆసమాచారం నీకు తెలిసిన మరుక్షణం అక్కడినుండి నిష్క్రమించు. (బాబా అవతారం ఎత్తినవారికి పరిస్థితి ఇంతవరకూ రాకపోవచ్చు)


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

2 comments:

  1. ఇది చదవగానే ఎందుకో రామలింగరాజు గుర్తుకు వస్తున్నారు. :)

    ReplyDelete
  2. అరుణ గారూ! రామలింగరాజుగారు ఈ వర్గంలోకి రాకపోవచ్చు. ఎందుకంటే ‘సత్యం’ సంస్థను ఆయన మోసం చేద్దామని ప్రారంభించలేదు. సదుద్దేశ్యంతోనే ప్రారంభించారు. దురాశతో మేటాస్ కు మరీ ఎక్కువ నిధులు మళ్ళించడం, ఆ సొమ్ము అక్కడ మట్టికొట్టుకు పోవడం, దానితో గత్యంతరంలేక ఆయన అందర్నీ ముంచేస్తూ చేతులెత్తేయడం.. ఇదే జరిగినది.

    దొంగ బాబాలు, దొంగ ఫైనాన్స్ కంపెనీలు, మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీలు, గుర్తింపులేని విద్యాలయాలు, నకిలీడాక్టర్‌లు, ఉద్యోగాల పేరుతో మోసం చేసేవారు మొదలైన వారు ఈ విభాగంలోకి వస్తారు. మన రాజకీయ నాయకులు, కొందరు మంచి బాబాలు కూడా ఎంతో కొంత ఈ వాసన ఉన్నవారే.:b

    ReplyDelete