Saturday, January 31, 2009

Law 48: ఏ ఒక్క రూపానికీ పరిమితం కాకు

ASSUME FORMLESSNESS

నైరూప్యతను అలవరచుకో


By taking a shape, by having a visible plan, you open yourself to attack. Instead of taking a form for your enemy to grasp, keep yourself adaptable and on the move. Accept the fact that nothing is certain and no law is fixed. The best way to protect yourself is to be as fluid and formless as water; never bet on stability or lasting order. Everything changes.


ఓ రూపాన్ని పొందటం వలన, గోచరమయ్యే ఓ ప్రణాళికను కలిగి ఉండటం వలన దాడి జరగడానికి వీలుగా నిన్ను నీవు బహిర్గతం చేసుకుంటావు. నీ శత్రువు గ్రహించేటట్లుగా ఓ రూపాన్ని పొందడానికి బదులుగా పరిస్థితులను బట్టి నిన్ను నీవు మార్చుకుంటూ, నిరంతరం గతిశీలతతో ఉండాలి. ఏదీ నిశ్చితమైనది కాదు, ఏ సూత్రమూ స్థిరమైనది కాదు అనే నిజాన్ని అంగీకరించు. నీరువలే రూపరహితంగా, ద్రవపదార్ధంగా ఉండటం అనేది నిన్ను నీవు రక్షించుకునే ఉత్తమమార్గం. స్థిరత్వాన్ని, చిరకాలం నిలబడటాన్ని ఎప్పుడూ నమ్ముకోకు. ప్రతీ విషయం మారుతుంది.

Image : Mercury : (Mercury రోమన్ పురాణాలలో ఇతర దేవతలకు దూతగా పనిచేసే దేవుడు. అంతేకాక ఇతడు వర్తకానికీ, దొంగలకు, మోసగాళ్ళకు, హాస్యానికి, వాగ్ధాటికి కూడా దేవుడు) రెక్కలున్న దూత, వర్తకదేవుడు, దొంగలకూ, జూదగాళ్ళకూ, ఇంకా నేర్పుగా మోసం చేసే అందరికీ రక్షకుడు. Mercury పుట్టిననాడే lyre అనే సంగీత సాధనాన్ని కనుగొన్నాడు. ఆ సాయంత్రమే Apollo యొక్క పశువులను దొంగిలించాడు. కోరిన రూపాన్ని కల్పించుకుంటూ, ప్రపంచమంతా వేగంగా సంచరిస్తాడు. ఇతని పేరే పెట్టబడిన ద్రవలోహం వలె అర్ధంకాని దానికీ, గ్రహించవీలులేని దానికీ నిర్ధిష్ట రూపాన్నిస్తాడు—నైరూప్యత యొక్క శక్తి ఇదే.

Reversal : శత్రువుకు అంతుపట్టకుండా ఉండటానికీ, అతడిని అలసిపోయేటట్లు చేయడానికీ నైరూప్యతను ఉపయోగించుకున్నా కూడా, శత్రువు మీద దాడి చేసేటపుడు మాత్రం నీ శక్తులన్నింటినీ ఏకీకృతం చేసి, నిర్ధిష్ట రూపాన్ని సంతరించుకో. అప్పుడు మాత్రమే శక్తివంతంగా దాడి చేయగలవు.

(రాబర్ట్ గ్రీన్ అన్నింటికన్నా చివరగా ఈ సూత్రాన్ని ఎందుకు పేర్కొన్నాడో గమనించండి. మనం తెలుసుకున్న ఈ అన్ని సూత్రాలలో దేన్నీ గుడ్డిగా ఆచరించకూడదు. సందర్భాన్ని బట్టి మనం అనుసరించే వ్యూహం మారిపోతుండాలి. పిడుగుకీ, బియ్యానికీ ఒక్కటే మంత్రం అన్నట్లుగా ఏ ఒక్క వ్యూహాన్నో, లేక ఏ ఒక్క సూత్రాన్నో విశ్వసించి, ఎల్లప్పుడూ దానినే అనుసరించటానికి ప్రయత్నించకూడదు. పరిస్థితిని అవగాహన చేసుకుని అందుకు తగ్గట్లుగా వ్యవహరించాలి)


‘The 48 Laws of Power’ పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

5 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. అరుణ గారూ,

    ఈ Laws ను మీరు మొదటి నుండి ఫాలో అవుతూ కామెంట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు! మీకే కాదు, నాకు కూడా వీటిలో కొన్నింటి ఎడల విముఖత ఉన్నది. ఇవన్నీ నా అభిప్రాయాలు కాదని మీకు తెలుసు కదా! అయితే వీటిని బ్లాగులో ప్రచురించడం వెనుక నా ఉద్దేశం లోకం పోకడను తెలియజెప్పడమే తప్ప ఇవన్నీ పాటించమని నేనెవరికీ ఉద్భోదించడం లేదు. అయితే ‘రాబర్ట్ గ్రీన్’ ద్వితీయ పురుష (second person) లోనే రచన చేశాడు. ఆ శైలి ప్రభావవంతంగా ఉందనిపించి నేనూ ఆ ద్వితీయపురుష లోనే అనువదించాను. దానితో నేను ఈ సూత్రాలన్నింటినీ సమర్ధిస్తూ, వాటిని పాటించమని ప్రబోధించినట్లుగా అందరికీ అనిపిస్తే అనిపించి ఉండవచ్చు.

    నేను గానీ, మీరుగానీ అంగీకరించలేని ఆ సూత్రాలేవీ కూడా విజయం సాధించలేని సామాజిక వ్యవస్థ ఏర్పడితే దానిని ఆహ్వానించే వారిలో నేను మొదట ఉంటాను. కానీ చాలా కాలం నుండీ ఉండి, ఇప్పుడు కూడా కొనసాగుతున్న సామాజిక పరిస్థితులలో ఈ సూత్రాలే విజయ మార్గాలుగా తయారయ్యాయి. ఆ సామాజిక పరిస్థితులను అంగీకరిస్తూ, ఈ సూత్రాలను వ్యతిరేకించడం సరికాదు. నీతి వర్తనులే విజయాన్ని సాధించి, సమాజంలో అగ్రభాగాన నిలబడే వ్యవస్థను కోరుకుందాం, దానికోసం పాటుబడదాం. అటువంటి వ్యవస్థలో ఈ సూత్రాలను ప్రత్యేకించి వ్యతిరేకించవలసిన అవసరంలేదు. వాటంతటవే దుమ్ముకొట్టుకు పోతాయి.

    నేను జనవరిలో ఈ ‘సుధర్మ’ బ్లాగును ప్రారంభించినది ‘48 Laws’ ను పరిచయం చేద్దామనే ఉద్దేశ్యంతోనే. ’The Art of Seduction’, ‘The 33 Strategies of War’ లను పరిచయం చేసే ఉద్దేశ్యం నాకు లేదు. ఒక సరికొత్త బోధనను, భావనను తోటిబ్లాగర్లకు పరిచయం చేద్దామనుకున్న నా ఉద్దేశ్యం నెరవేరడానికి 48 Laws చాలు. అదీగాక The Art of Seduction గ్రంథాన్నైతే మన బ్లాగ్లోకం జీర్ణించుకోలేదు. అందుకే ఈ విషయం మీద ఇంక నేనేమీ రాయదల్చుకోలేదు. మరలా సుధర్మలో ఏదైనా రాస్తే వేరే టాపిక్ మీదే రాస్తాను. నా రెగ్యులర్ బ్లాగు ‘శంఖారావం’ మాత్రమే. దానికే నేను అరుదుగా రాస్తుంటాను.

    ‘వేణుగానం’లో అరుణం పేరుతో వచ్చిన కామెంట్ మీదేనా? మీ ప్రొఫైల్ అందుబాటులో లేదు. మీరు రాసే బ్లాగు ఏదైనా ఉందా? వీలైతే తెలియజేయగలరు.

    ధన్యవాదాలు!

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. అరుణం పేరుతో వేరెవరో రాస్తుండేప్పటికి నా profile and blog enable చేస్కున్నాను.

    ReplyDelete
  5. I would like to delete my previous comments

    ReplyDelete