బ్లాగ్మితృలందరికీ నా నమస్కారం ! అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు !
కొత్తసంవత్సరంలో మరో కొత్తబ్లాగు. బ్లాగు కొత్తదేగానీ నేను పాత వాడినే. అదేనండీ సరస్వతీ కుమార్‌ను. నా శంఖారావం బ్లాగు ద్వారా నేను మీలో చాలా మందికి పరిచయమైనవాడినే. నేను చదివిన పుస్తకాలను పరిచయం చేయడానికి ఉద్దేశించిన నా వర్డ్‌ప్రెస్ బ్లాగ్ వేణుగానం కూడా మీకు తెలిసే ఉంటుంది. ఈ రెండూ కాక ఇప్పుడు నేను ‘సుధర్మ’ పేరుతో ఈ కొత్త బ్లాగును ప్రారంభిస్తున్నాను. దీని URL-http://sudharmasabha.blogspot.com.
అరుదుగా టపాలు రాసే నాకు మరో బ్లాగెందుకంటారా! కొన్ని కారణాలున్నాయి. నేను చెప్పదలచుకున్న లేక నాకు తెలిసిన విషయాలలో ఒక బ్లాగులోనే వర్గాలు, ఉపవర్గాలుగా విభజించేంతటి డైవర్షన్ ఏమీ ఉండదు. అందుకే ఒకే రకమైన విషయాలకు ఒక బ్లాగు చొప్పున కేటాయించదలచుకున్నాను. అదీగాక ఒక బ్లాగును అంతులేని టపాలతో ఓ మహా సముద్రంలా మార్చటం నా వరకూ నాకు ఇష్టం ఉండదు. బ్లాగుకు ఓ వంద, నూట యాభై మించి టపాలు లేకుండా చూడాలనుకుంటున్నాను.
నా బ్లాగును ఎవరైనా, ఎప్పుడైనా ఓ పుస్తకంలా మొదటి టపా నుండి, చివరి టపా వరకు చదివేయగలిగేటట్లుగా ఉండాలి. బాగా ఎక్కువ టపాలున్న బ్లాగును ఇలా చదవడం కుదరకపోవచ్చని నా అభిప్రాయం. అయితే అందరికీ నేనీ సలహాను ఈయబోవడం లేదు. నేనెటూ టపాలు రాసేది అరుదుగానే కనుక ఈ విధానం నాబోటి వారికి వీలుపడుతుంది అనుకుంటున్నాను.
ఈ బ్లాగుకు పెట్టిన ‘సుధర్మ’ అనే పేరంటే నాకు చాలా ఇష్టం. మొదట నేను ఈ పేరును నా మొదటి blogger బ్లాగుకే పెడదామనుకున్నాను. కానీ అప్పటికే shankharavam అన్న పదంతో URL క్రియేట్ అయిపోయింది. బ్లాగు పేరు కూడా URL లో ఉన్న పదమే అయితే బావుంటుందనుకుని దానినే ఉంచేశాను. తరువాత నా వర్డ్‌ప్రెస్ బ్లాగుకైనా ‘సుధర్మ’ అని పేరు పెడదామనుకున్నాను.. పెట్టాను కూడా. రెండు మూడు రోజుల పాటు అదే పేరుతో ఉన్నది. దానికి ‘ఇది శ్రీకృష్ణుని సభ’ అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టాను. :b కానీ, పుస్తక పరిచయాలకు ఉద్దేశించిన బ్లాగుకు ‘సుధర్మ’ అనే పేరెందుకులే అని భావించడంతోపాటు శంఖారావానికి మాచింగ్ గా ఉంటుందని ‘వేణుగానం’ అని పేరు మార్చేశాను.
ఇక ఇప్పటికి ఈ కొత్తబ్లాగుకు ఆ పేరు పెట్టడంతో నా కోరిక తీరింది. ఇంతకీ ‘సుధర్మ’ అంటే ఏమిటో.. ఆపేరుకు గల విశేషాలేమిటో తెలుసుకుందాం.
శ్రీకృష్ణునకు దేవేంద్రునిచే బహుమతిగా ఈయబడిన సభామందిరం పేరే ‘సుధర్మ’. శ్రీకృష్ణుడు ఈ సభామందిరంలోనే కొలువుదీరేవాడు. శ్రీకృష్ణుడు మరణించిన తరువాత అర్జునుడు కూడా ఈ సుధర్మ సభలోనే ద్వారకా వాసులందరినీ కొలువుదీర్చి మాట్లాడాడు.
అందుకే ఈ సుధర్మ అనే పేరు మన భారతీయ సంస్కృతికి, వారసత్వానికి ప్రతిబింబంగా అనిపిస్తుంది. బెంగుళూరు నుండి వెలువడుతున్న ప్రపంచం మొత్తంలోని ఒకే ఒక సంస్కృత పత్రిక పేరు కూడా సుధర్మే అని నాకు ఈ మధ్యనే తెలిసినది. ఎవరో బ్లాగ్మితృడు ఆ పత్రిక గురించి టపా కూడా రాసినట్లు గుర్తు.
నేను శంఖారావానికి గానీ, వేణుగానానికి గానీ ఇలా కొత్త బ్లాగు పరిచయం రాసుకోలేదు. నేను మిత్రుల ద్వారానో లేక మరెవరైనా తెలిసిన వారి ద్వారానో బ్లాగింగ్ ను ప్రారంభించలేదు. ‘ఈనాడు’ దినపత్రిక ఆదివారం అనుబంధ పుస్తకాలలోని వ్యాసాలను చదివి, వాటిలో వివరించిన విధివిధానాలు కొంత అర్ధమై, కొంత అర్థంకాక.. అలా కన్‌ఫ్యూజన్ తో ఆ రెండు బ్లాగులూ ప్రారంభించాను. అందుకే ఆ కంగారులో కొత్త బ్లాగు పరిచయం లాంటివేమీ లేకుండా ఒకేసారి మామూలు పోస్టులు రాసేశాను. ఈ టపాతో ఆ లోటు కూడా తీరింది. :b
ఈ కొత్తబ్లాగు పరిచయ వ్యాసంలో నా బ్లాగును ఆదరించమని నేను కోరాలనుకోవటం లేదు. ఎందుకంటే బ్లాగులో అడ్డమైన చెత్త, సోది రాసి ఆదరించమని వేడుకున్నా ప్రయోజనం ఉండదు. టపాలలో విషయం ఉండి, రచనా శైలి ఆసక్తి జనకంగా ఉంటే ఆదరణ దానంతటదే వస్తుంది. కనుక ఆదరించమని ప్రత్యేకించి కోరే అవసరంలేదని అనుకుంటున్నాను. నా వరకూ నేను ఈ ఆదరణ గురించి పెద్దగా పట్టించుకోను కూడా. నా భావాలను క్రమబద్దీకరించుకోవడం, మరింత స్పష్టపరచుకోవటం, వాటిని అందరికీ అందుబాటులో ఉండే ఒక శాశ్వతమైన చిరునామాలో పొందుపరచటం.. ఇవే నేను బ్లాగులు రాయడం లోని ప్రధాన ఉద్దేశాలు.
ధన్యవాదాలు !

Welcome !!!
ReplyDeleteఅభినందనలు సరస్వతికుమార్ గారు,
ReplyDeleteమీ ఆశయసాధన అవిఛ్ఛిన్నంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాను.
నాకొక మెయిలు పంపగలరా??తీరికచూసుకుని
devarapalli.rajendrakumar
@
gmail.
com
ఒకరకంగా చెప్పాలంటే మీరు,నేను బంధువులవుతాం.ఎలాగంటారా మీ బ్లాగుల పేర్లు,నాబ్లాగు పేరు కృష్ణభగవానునికి సంబంధించినవే కాబట్టి.పేరులో మాత్రమే సుమా!రాతల్లో కాదు .మీరు సరస్వతీ పుత్రులు మరి నేనేమో వసుధ పుత్రున్నిఅంటే ఏదో పొలం గట్రా దున్నుకునే వాణ్ణి.గీతలోనే గానీ రాతలో పసలేనివాణ్ణి.
ReplyDelete:) welcome
ReplyDeleteకొత్త బ్లాగుకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'సభాభవనం' పేరు కూడా సుధర్మ అనే అనుకుంటాను. రామారావు ముఖ్యమంత్రి అయినపుడు జరిగిన పేర్లమార్పిడుల్లో ఈ పేరు వచ్చింది.
ReplyDeletesubaabhinamdanalu
ReplyDeleteధృవ గారికి, నేస్తం గారికి, దుర్గేశ్వర గారికి ధన్యవాదాలు !
ReplyDelete@ రాజేంద్ర కుమార్ గారు, మీ అభినందనలకు, ప్రోత్సాహానికి కృతజ్ఞతలు! త్వరలోనే మీకు మెయిల్ చేస్తాను.
@ చిలమకూరు విజయమోహన్ గారు, మీ ప్రొఫైల్ చూశాను. శ్రీకృష్ణునకు సంబంధించిన ఏ విషయమైనా మీకు ఇష్టమని రాశారు. ఈ విధంగా మనం బంధువులమే అవుతాము మీరన్నట్లుగా! :b
‘రైతే రాజంటున్న దేశంలో నేనూ ఒక మహారాజును.’ ఇంత చక్కటి వాక్య నిర్మాణం చేసిన మీకు రాతలో పసలేకపోవడమేమిటి! మీరు వసుధ పుత్రులే కాక సరస్వతీ పుత్రులు కూడా! :b అన్నట్లు మాదీ రైతు కుటుంబమే !
@ చదువరి గారు, మన ముఖ్యమంత్రి సభాభవనం పేరు ‘సుధర్మ’ అని నాకు తెలుయదు. తెలియజేసినందుకు ధన్యవాదాలు! NTR కు శ్రీకృష్ణుడంటే ఎంత అభిమానమో, ఎంత తాదాత్మ్యతో అందరికీ తెలిసిన విషయమే. అందుకే అలా పేరు మార్పించి ఉంటాడు.
This comment has been removed by the author.
ReplyDelete