Saturday, January 31, 2009

Law 48: ఏ ఒక్క రూపానికీ పరిమితం కాకు

ASSUME FORMLESSNESS

నైరూప్యతను అలవరచుకో


By taking a shape, by having a visible plan, you open yourself to attack. Instead of taking a form for your enemy to grasp, keep yourself adaptable and on the move. Accept the fact that nothing is certain and no law is fixed. The best way to protect yourself is to be as fluid and formless as water; never bet on stability or lasting order. Everything changes.


ఓ రూపాన్ని పొందటం వలన, గోచరమయ్యే ఓ ప్రణాళికను కలిగి ఉండటం వలన దాడి జరగడానికి వీలుగా నిన్ను నీవు బహిర్గతం చేసుకుంటావు. నీ శత్రువు గ్రహించేటట్లుగా ఓ రూపాన్ని పొందడానికి బదులుగా పరిస్థితులను బట్టి నిన్ను నీవు మార్చుకుంటూ, నిరంతరం గతిశీలతతో ఉండాలి. ఏదీ నిశ్చితమైనది కాదు, ఏ సూత్రమూ స్థిరమైనది కాదు అనే నిజాన్ని అంగీకరించు. నీరువలే రూపరహితంగా, ద్రవపదార్ధంగా ఉండటం అనేది నిన్ను నీవు రక్షించుకునే ఉత్తమమార్గం. స్థిరత్వాన్ని, చిరకాలం నిలబడటాన్ని ఎప్పుడూ నమ్ముకోకు. ప్రతీ విషయం మారుతుంది.

Image : Mercury : (Mercury రోమన్ పురాణాలలో ఇతర దేవతలకు దూతగా పనిచేసే దేవుడు. అంతేకాక ఇతడు వర్తకానికీ, దొంగలకు, మోసగాళ్ళకు, హాస్యానికి, వాగ్ధాటికి కూడా దేవుడు) రెక్కలున్న దూత, వర్తకదేవుడు, దొంగలకూ, జూదగాళ్ళకూ, ఇంకా నేర్పుగా మోసం చేసే అందరికీ రక్షకుడు. Mercury పుట్టిననాడే lyre అనే సంగీత సాధనాన్ని కనుగొన్నాడు. ఆ సాయంత్రమే Apollo యొక్క పశువులను దొంగిలించాడు. కోరిన రూపాన్ని కల్పించుకుంటూ, ప్రపంచమంతా వేగంగా సంచరిస్తాడు. ఇతని పేరే పెట్టబడిన ద్రవలోహం వలె అర్ధంకాని దానికీ, గ్రహించవీలులేని దానికీ నిర్ధిష్ట రూపాన్నిస్తాడు—నైరూప్యత యొక్క శక్తి ఇదే.

Reversal : శత్రువుకు అంతుపట్టకుండా ఉండటానికీ, అతడిని అలసిపోయేటట్లు చేయడానికీ నైరూప్యతను ఉపయోగించుకున్నా కూడా, శత్రువు మీద దాడి చేసేటపుడు మాత్రం నీ శక్తులన్నింటినీ ఏకీకృతం చేసి, నిర్ధిష్ట రూపాన్ని సంతరించుకో. అప్పుడు మాత్రమే శక్తివంతంగా దాడి చేయగలవు.

(రాబర్ట్ గ్రీన్ అన్నింటికన్నా చివరగా ఈ సూత్రాన్ని ఎందుకు పేర్కొన్నాడో గమనించండి. మనం తెలుసుకున్న ఈ అన్ని సూత్రాలలో దేన్నీ గుడ్డిగా ఆచరించకూడదు. సందర్భాన్ని బట్టి మనం అనుసరించే వ్యూహం మారిపోతుండాలి. పిడుగుకీ, బియ్యానికీ ఒక్కటే మంత్రం అన్నట్లుగా ఏ ఒక్క వ్యూహాన్నో, లేక ఏ ఒక్క సూత్రాన్నో విశ్వసించి, ఎల్లప్పుడూ దానినే అనుసరించటానికి ప్రయత్నించకూడదు. పరిస్థితిని అవగాహన చేసుకుని అందుకు తగ్గట్లుగా వ్యవహరించాలి)


‘The 48 Laws of Power’ పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 47: లక్ష్యాన్ని దాటి అవతలికి పోకు

DO NOT GO PAST THE MARK YOU AIMED FOR; IN VICTORY, LEARN WHEN TO STOP

నీవు ధ్యేయంగా పెట్టుకున్న స్థానాన్ని దాటి అవతలికి పోకు; విజయ సాధనలో ఎక్కడ ఆగాలో నేర్చుకో


The moment of victory is often the moment of greatest peril. In the heat of victory, arrogance and overconfidence can push you past the goal you had aimed for, and by going too far, you make more enemies than you defeat. Do not allow success to go to your head. There is no substitute for strategy and careful planning. Set a goal, and when you reach it, stop.


విజయం సిద్ధించిన క్షణం తరచుగా గొప్ప విపత్కరమైన క్షణం కూడా అవుతుంది. విజయపు వేడిలో గర్వం మరియు అతివిశ్వాసం నీవు ధ్యేయంగా పెట్టుకున్న లక్ష్యం కన్నా అవతలికి నిన్ను నెడతాయి. నీవు అలా దూరంగా వెళ్ళడం వలన నీవు జయించగలిగిన దానికన్నా ఎక్కువమంది శత్రువులను తయారు చేసుకుంటావు. విజయాన్ని నీ తల మీదకు ఎక్కనీయకు. వ్యూహం మరియు జాగ్రత్తతో కూడిన ప్రణాళికకు ప్రత్యామ్నాయమనేది లేదు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకో, దానిని చేరగానే ఆగిపో.

Image : ఆకాశం నుండి పడిపోతున్న Icarus : (Icarus గ్రీకు పురాణ పురుషుడు, Daedalus ఇతని తండ్రి, Minotaur ఎద్దు మరియు మనిషి శరీరాలు కలగలిసిన ఆకారంగల ఒక రాక్షసి) ఇతని తండ్రి Daedalus రూపొందించిన మైనపు రెక్కల సహాయంతో Minotaur బారి నుండి తప్పించుకుని, మాయాబోను నుండి ఇద్దరూ ఎగిరిపోయారు. ఆ ఎగిరే ఉత్సాహంలో, విజయవంతంగా తప్పించుకునే ఆ హర్షాతిరేకంలో Icarus ఎంతోఎత్తుకు ఎగిరాడు. ఆ ఎత్తులో సూర్యుని ధాటికి రెక్కలు కరిగి, నేలకు దూసుకొచ్చి, ఢీకొని మరణించాడు.

Reversal : శత్రువు మీద విజయం సాధించినపుడు మాత్రం విజయం సిద్ధించడంతోటే ఆగిపోకు. అతడిని పూర్తిగా నాశనం చేసే వరకూ వదిలిపెట్టకు.


‘The 48 Laws of Power’ పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 46: తప్పనేది లేకుండా ఎప్పుడూ కనబడకు

NEVER APPEAR TOO PERFECT

మరీ పరిపూర్ణంగా ఎప్పుడూ కనబడకు


Appearing better than others is always dangerous, but most dangerous of all is to appear to have no faults or weaknesses. Envy creates silent enemies. It is smart to occasionally display defects, and admit to harmless vices, in order to deflect envy and appear more human and approachable. Only gods and the dead can seem perfect with impunity.


ఇతరులకన్నా ఉత్తమంగా కనబడటం ఎల్లప్పుడూ ప్రమాదకరం, అయితే తప్పులుకానీ, బలహీనతలుగానీ లేకుండా కనబడటం అన్నింటిలోకీ అతిప్రమాదకరం. అసూయ నిశ్శబ్ధ శత్రువులను సృష్టిస్తుంది. అసూయను దారి మళ్ళించడానికి, మరింత మానవీయంగా కనిపించడానికీ, మరింత సన్నిహితంగా కనిపించడానికి అప్పుడప్పుడూ లోపాలను ప్రదర్శించుకోవడం, హానికరంగాని తప్పులను ఒప్పుకోవడం తెలివైన పని. దేవుళ్ళు, చనిపోయినవారు మాత్రమే శిక్షించలేనంతటి పరిపూర్ణతతో కనిపించగలుగుతారు.

Image : A Garden of Weeds (కలుపు పెరిగిన తోట) : నీవు వాటికి పోషకాన్ని అందించవలసిన పనిలేదు. అయితే నీవు తోటకు నీరు పెడుతున్న కోలదీ అవి వ్యాప్తి చెందుతాయి. ఎలానో నీవు చూడలేవు కానీ అందమైన దేనినీ వృద్ధి చెందనీయకుండా, అవి పొడవుగా, అసహ్యంగా పెరుగుతాయి. మరీ ఆలస్యం జరగకముందే, విచక్షణారహితంగా నీరందివ్వటం మానివేయి. ఎటువంటి పోషకాన్ని అందివ్వకుండా అసూయ అనే కలుపు మొక్కలను నాశనం చేయి.

Reversal : నీవు సురక్షిత స్థానంలో గనుక ఉంటే నీమీద అసూయపడే వారిని మరింత అసూయకు గురిచేయి.


‘The 48 Laws of Power’ పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 45: మార్పును ప్రభోధించు, కానీ మార్చకు

PREACH THE NEED FOR CHANGE, BUT NEVER REFORM TOO MUCH AT ONCE

మార్పు యొక్క అవసరాన్ని ప్రబోధించు, కానీ ఒకేసారి ఎక్కువగా ఎప్పుడూ సంస్కరించకు


Everyone understands the need for change in the abstract, but on the day-to-day level people are creatures of habit. Too much innovation is traumatic, and will lead to revolt. If you are new to a position of power, or an outsider trying to build a power base, make a show of respecting the old way of doing things. If change is necessary, make it feel like a gentle improvement on the past.


మార్పు ఆవశ్యకత యొక్క సారాంశాన్ని ప్రతిఒక్కరూ అర్థం చేసుకుంటారు. కానీ సాధారణ స్థాయి ప్రజలు 'అలవాటు ' జీవులు. శృతిమించిన కొత్తదనం అనేది తట్టుకోలేనిదిగా ఉండి, తిరుగుబాటుకు దారితీస్తుంది.నీవు అధికారానికి కొత్త అయితే, లేక బయటిప్రాంతానికి చెందిన వ్యక్తివైన పక్షంలో, పాతపద్ధతి ప్రకారం పనిచేయడాన్ని గౌరవిస్తున్నట్లు కనబడు. మార్పు గనుక అవసరమైతే గతపద్ధతి యొక్క స్వల్ప పురోగతిగానే అది భావించబడేటట్లు చేయి.

Image : పిల్లి : అలవాటు ప్రకారం నడచుకునే జీవిగా ఇది పరిచయమైన విషయాలలో ఉండే హాయిని ఇష్టపడుతూ ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ చేసే పనులను భంగపరిస్తే, ఇది తిరుగాడే తావులను చెడగొడితే దీనికి మతిభ్రమిస్తుంది, నియంత్రించలేని విధంగా తయారవుతుంది. దాని ఆచారాలకు మద్దతునివ్వడం ద్వారా దానిని సంతోషపెట్టు. మార్పు అవసరమైన పక్షంలో గతకాలపు వాసనను సజీవంగా ఉంచడంద్వారా ఆ పిల్లిని వంచించు; వ్యూహాత్మకమైన స్థానాలలో దానికి బాగా పరిచయమున్న వస్తువులను ఉంచు.

Reversal : సమీప గతంలో ఏదైనా బాధాకరమైనది లేక కర్కశమైనది జరిగిన పక్షంలో దానితో అనుబంధాన్ని ఏర్పరచుకోకు. వెంటనే కొత్త పద్ధతులను ప్రవేశపెట్టు, కొత్త ఆచారాలను, కొత్త సంప్రదాయ రూపాలను ఏర్పరచు.


‘The 48 Laws of Power’ పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 44: అనుకరించి ఆవేశపరచు

DISARM AND INFURIATE WITH THE MIRROR EFFECT

ప్రతిబింబించడం ద్వారా బలహీనపరచు


The mirror reflects reality, but it is also the perfect tool for deception: When you mirror your enemies, doing exactly as they do, they cannot figure out your strategy. The Mirror Effect mocks and humiliates them, making them overreact. By holding up a mirror to their psyches, you seduce them with the illusion that you share their values; by holding up a mirror to their actions, you teach them a lesson. Few can resist the power of the Mirror Effect.


అద్దం వాస్తవాన్నే ప్రతిబింబిస్తుంది, అయితే ఇది వంచించడానికి సరియైన సాధనం కూడా: నీవు నీ శత్రువులను ప్రతిబింబిస్తే, వారు చేసినట్లుగానే చేస్తుంటే, నీ వ్యూహాన్ని వారు ఆకళింపు చేసుకోలేరు. దర్పణ ప్రభావం వారిని గేలిచేస్తుంది, అవమానిస్తుంది, వారు అతిగా స్పందించేటట్లు చేస్తుంది.వారి మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తూ, వారి విలువలను నీవు పాటిస్తున్నావన్న భ్రమతో వారిని లోబరచుకో. వారి చేతలను ప్రతిబింబిస్తూ, వారికి గుణపాఠం నేర్పు. దర్పణ ప్రభావాన్ని అతి కొద్దిమంది మాత్రమే ప్రతిఘటించగలరు.

Image : The Shield of Perseus : (గ్రీకు పురాణాలలో Perseus ఒక కథానాయకుడు. Medusa భయంకర రూపంలో ఉండే ఒక రాక్షసి) ఇది ఒక అద్దంలాగా మెరుగుపెట్టబడి ఉంటుంది. Medusa నిన్ను చూడలేదు. తన స్వంత భయంకర రూపం మాత్రమే ఆ అద్దంలో ప్రతిబింబిస్తుంది. అటువంటి అద్దం వెనుక నీవు వంచన చేయవచ్చు, గేలి చేయవచ్చు, అవేశపరచవచ్చు. ఒక్క దెబ్బతో ఏ అనుమానమూ లేని Medusa తలను వేరుచేయవచ్చు.

Warning : గతకాలపు వ్యక్తులను, సంఘటనలను అనుకరించడానికీ, ప్రతిబింబించడానికీ ప్రయత్నించకు. గతంలోని వ్యక్తులు, సంఘటనలు ప్రమాదకారకాలైన పక్షంలో, నీకే ఉద్దేశ్యంలేకున్నా ప్రజలు నీనుండి కూడా ప్రమాదాన్ని ఊహిస్తారు. గతంలోనివి మంచి అయినా కూడా నీకు అపాయమే. ఎందుకంటే గతంలోని మంచి వ్యక్తులలో, సంఘటనలలో తాము గమనించినంత మంచిని, నీవు ఎంతమంచిగా ఉన్ననూ, ప్రజలు నీలో దర్శించరు.


‘The 48 Laws of Power’ పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Thursday, January 29, 2009

Law 43: మనసులమీద పనిచేయి

WORK ON THE HEARTS AND MINDS OF OTHERS

హృదయాలమీద, మనసులమీద పనిచేయి


Coercion creates a reaction that will eventually work against you. You must seduce others into wanting to move in your direction. A person you have seduced becomes your loyal pawn. And the way to seduce others is to operate on their individual psychologies and weaknesses. Soften up the resistant by working on their emotions, playing on what they hold dear and what they fear. Ignore the hearts and minds of others and they will grow to hate you.


బలవంతం అనేది అంతిమంగా నీకు విరుద్ధంగా పనిచేసే ప్రతిస్పందనను మాత్రమే సృష్టిస్తుంది. ఇతరులు కోరి నీవైపు వచ్చేటట్లుగా నీవు వారిని లోబరచుకోవాలి. నీవు లోబరచుకున్న వ్యక్తి నీకు విధేయుడైన బంటుగా మారతాడు. ఇతరులను లోబరచుకునే మార్గం వారి వ్యక్తిగత మనస్తత్వాలు, మరియు బలహీనతలతో వ్యవహరించడమే. వారి భావావేశాలమీద పనిచేయడం ద్వారా, వారు ఇష్టపడే వాటినీ, భయపడే వాటినీ చూపడం ద్వారా ప్రతిఘటనను బలహీనం చేయి. నీవు ఇతరుల హృదయాలను, మనసులను ఉపేక్షిస్తే వారు నిన్ను ద్వేషించేంతగా మారిపోతారు.

Image : The Keyhole : ప్రజలు నిన్ను బయటే ఉంచడానికి గోడలు నిర్మిస్తారు. బలవంతంగా లోపలికి చొరబడాలని ప్రయత్నించకు—గోడల లోపల మరిన్ని గోడలు మాత్రమే నీకు కనబడతాయి. ఆ గోడలకు తలుపులు ఉంటాయి. అవి చిన్న పాటి తాళపు రంధ్రాన్ని కూడా కలిగి ఉంటాయి. ఆ తాళపు రంధ్రం గుండా తొంగిచూసి, ఆ తలుపును తెరిచే తాళం చెవిని కనిపెట్టు, బలవంతపు ప్రవేశంలో ఉండే వికృత లక్షణాలేవీ లేకుండా, వారి ఇష్టపూర్వకంగానే నీవు లోనికి ప్రవేశించగలవు.

Reversal : There is no possible reversal to this Law.


‘The 48 Laws of Power’ పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 42: కాపరిని కొట్టు, గొఱ్ఱెలు చెదిరిపోతాయి

STRIKE THE SHEPHERD AND THE SHEEP WILL SCATTER

కాపరిని కొట్టు, గొఱ్ఱెలు చెదిరిపోతాయి


Trouble can often be traced to a single strong individual—the stirrer, the arrogant underling, the poisoner of goodwill. If you allow such people room to operate, others will succumb to their influence. Do not wait for the troubles they cause to multiply, do not try to negotiate with them—they are irredeemable. Neutralize their influence by isolating or banishing them. Strike at the source of the trouble and the sheep will scatter.


కష్టానికి మూలం తరచుగా ఒకేఒక బలమైన వ్యక్తి అయిఉంటాడు—కలకలం సృష్టించేవాడు, అహంకారం కలిగిన క్రిందిస్థాయి వ్యక్తి, సౌహార్ధతను చెడగొట్టేవాడు. నీవు గనుక అటువంటి వ్యక్తులకు అవకాశం ఇస్తే, వారి ప్రభావానికి ఇతరులు లోబడిపోతారు. వారు కలుగ జేసే చిక్కులు రెట్టింపు అయ్యేంతవరకూ వేచిచూడకు, వారితో సంప్రదింపులు జరపటానికి ప్రయత్నించకు—వారు మార్చలేని వ్యక్తులు. వారిని ఒంటరి చేయడం ద్వారానో, లేక బహిష్కరించడం ద్వారానో వారి ప్రభావాన్ని తటస్థపరచు. చిక్కులకు మూలస్థానంలో కొట్టు, గొఱ్ఱెలు వాటంతటవే పారిపోతాయి.

Image : A Flock of Fatted Sheep : ఒకటో, రెండో గొఱ్ఱెలను దొంగిలించడానికి ప్రయత్నిస్తూ నీ విలువైన సమయాన్ని వ్యర్ధం చేసుకోకు; గొఱ్ఱెల మందకు కావలిగా ఉన్న కుక్కల మీద దాడి చేయడం ద్వారా ప్రాణాలమీదకు తెచ్చుకోకు. కాపరిని లక్ష్యంగా చేసుకో. అతడిని ప్రలోభపెట్టి దూరంగా పంపు, కుక్కలు అతడిని వెంబడిస్తాయి. అతడిమీద దాడిచేసి పడగొడితే, గొఱ్ఱెలమంద చెల్లాచెదురైపోతుంది—వాటిని నీవు ఒకదాని తరువాత ఒకటిగా వేటాడవచ్చు.

Reversal : నీ మీద ప్రతీకారం తీర్చుకోగల సామర్ధ్యం ఉన్న వ్యక్తిని ఎప్పుడూ ఒంటరిని చేయకు. అతడిని నీతోనే ఉంచుకొని, జాగ్రత్తగా గమనిస్తూ, సరైన సమయంలో వేటువేయి.


‘The 48 Laws of Power’ పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 41: చెట్టుపేరు చెప్పి కాయలమ్మకు

AVOID STEPPING INTO A GREAT MAN’S SHOES

ఒక గొప్పవ్యక్తి చెప్పులలో కాళ్ళు దూర్చకు


What happens first always appears better and more original than what comes after. If you succeed a great man or have a famous parent, you will have to accomplish double their achievements to outshine them. Do not get lost in their shadow, or stuck in a past not of your own making: Establish your own name and identity by changing course. Slay the overbearing father, disparage his legacy, and gain power by shining in your own way.


మొదట సంభవించినది తరువాత వచ్చేదానికన్నా ఎల్లప్పుడూ ఉత్తమమైనదిగా, మరింత మౌలికమైనదిగా ఉంటుంది. నీవు ఎవరైనా గొప్ప వ్యక్తికి ఉత్తరాధికారివైతే, లేదంటే ఒక సుప్రసిద్ధుడైన తండ్రిని కలిగి ఉంటే, వారిని అధిగమించడానికి వారు సాధించినదానికన్నా రెండింతలు నీవు నెరవేర్చవలసి ఉంటుంది. వారి నీడలో కనుమరుగైపోకు, లేక నీవు స్వయంగా నిర్మించని గతానికి అతుక్కుపోకు: వ్యవహారసరళిని మార్చడం ద్వారా నీ స్వంత పేరును, గుర్తింపును స్థాపించుకో. తలదన్నే తండ్రి తలదన్నివేయి, అతడినుండి నీకు సంక్రమించినదానికి విలువనీయకు. నీదైన విధానంలో వెలుగొందుతూ శక్తిని సంపాదించు.

Image : తండ్రి : అతడు తన పిల్లల మీద పెద్ద నీడను ఆవరింపజేస్తాడు. వారిని గతానికి బంధించి వేసి తనుపోయిన చాలాకాలం తరువాత కూడా వారిని బానిసత్వంలోనే ఉంచుతాడు, వారి యవ్వన స్ఫూర్తిని పీల్చిపిప్పి చేస్తాడు, తను చిరకాలంగా నడచిన దారిలోకే వారినీ బలవంతంగా తేవాలని చూస్తాడు. అతని యుక్తులు చాలా ఉంటాయి. ప్రతి కూడలిలో నీవు తండ్రిని తప్పక దెబ్బకొట్టి, అతని నీడ నుండి బయటకు అడుగిడు.

Reversal :

1. నీవు అధికారంలో ప్రాధమికంగా కుదురుకునే వరకూ నీ తండ్రి పేరు ప్రఖ్యాతులు వాడుకో.

2. విభిన్నత పేరుతో గతంలోని మంచిని, ఉత్తమత్వాన్ని వదలుకోకు.

3. నీవు పెద్దలను ఎదిరించినట్లుగా, కుర్రకారు నిన్ను ఎదిరించకుండా, అధిగమించకుండా జాగ్రత్తపడు.


‘The 48 Laws of Power’ పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 40: ఉచితంగా ఇవ్వజూపేదానిని తిరస్కరించు

DESPISE THE FREE LUNCH

ఉచితంగా ఇవ్వజూపేదానిని తిరస్కరించు


What is offered for free is dangerous—it usually involves either a trick or a hidden obligation. What has worth is worth paying for. By paying your own way you stay clear of gratitude, guilt, and deceit. It is also often wise to pay the full price—there is no cutting corners with excellence. Be lavish with your money and keep it circulating, for generosity is a sign and a magnet for power.


ఉచితంగా ఇవ్వజూపబడేది ప్రమాదకరమైనది—దానిలో సాధారణంగా ఏదైనా వంచనో లేక దాగి ఉన్న ముందరికాళ్ళకు బంధమో కలగలసి ఉంటుంది. తగిన మూల్యం చెల్లించి పొందినదే విలువ కలిగి ఉంటుంది. నీదైన విధానంలో చెల్లించడం చేత నీవు కృతజ్ఞత, దోషం, వంచన ఇవేమీ అంటకుండా ఉంటావు. అంతేకాదు, పూర్తివిలువను చెల్లించడం వివేకవంతంగా ఉంటుంది—శ్రేష్ఠతకు తగ్గింపు అనేది ఉండదు. ఉదారత శక్తికి చిహ్నమేకాక దానిని ఆకర్షిస్తుంది కనుక డబ్బును సమృద్ధిగా ఖర్చు చేస్తూ, దాన్ని చలామణీలో ఉంచు.

Image : నది : నీ రక్షణకో లేక వనరును సంరక్షించడానికో దీనికి ఆనకట్ట వేయి. తొందరలోనే ఆ నీరు చిత్తడిగా, ప్రాణాంతకంగా మారిపోతుంది. అటువంటి కదలని నీటిలో చాలా అపరిశుభ్రమైన జీవజాలం మాత్రమే జీవిస్తుంది. దానిలో ఏదీ ప్రయాణించదు. వాణిజ్యమంతా ఆగిపోతుంది. ఆ ఆనకట్టను నాశనం చేయి. నీరు పొంగి ప్రవహించినపుడు ఎన్నడూ లేనంత పెద్ద పరిధులలో సమృద్ధినీ, సంపదనూ, శక్తినీ ఉత్పన్నం చేస్తుంది. మంచి విషయాలు అభివృద్ధి చెందడానికి నదికి అప్పుడప్పుడూ తప్పక వెల్లువ రావాలి.

Reversal : తేరగా వచ్చేదానిని నీ వెప్పుడూ ఆశించ వద్దు. కానీ అలా ఆశించేవారికి మాత్రం ఎరవేసి లాభం పొందు.


‘The 48 Laws of Power’ పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Wednesday, January 28, 2009

Law 39: రెచ్చగొట్టి అదుపుచేయి

STIR UP WATERS TO CATCH FISH

చేపను పట్టడానికి నీటిని కదిలించు


Anger and emotion are strategically counterproductive. You must always stay calm and objective. But if you can make your enemies angry while staying calm yourself, you gain a decided advantage. Put your enemies off-balance: Find the chink in their vanity through which you can rattle them and you hold the strings.


కోపం మరియు ఆవేశం వ్యూహాత్మకంగా వ్యతిరేకఫలితాన్నిస్తాయి. నీవెప్పుడూ తప్పక శాంతంగా, తటస్థంగా ఉండాలి. కానీ నీవు శాంతంగా ఉంటూనే నీ శత్రువులకు కోపం వచ్చేటట్లుగా గనుక చేయగలిగితే నీవు నిర్ణయాత్మకమైన అనుకూలతను పొందుతావు. నీ శత్రువులను అస్థిరంగా ఉంచు: వారి అహంలో గల బలహీనప్రాంతాన్ని కనిపెట్టి తద్వారా వారిని కల్లోల పరచి, పరిస్థితి మీద అదుపు సాధించు.

Image (సాదృశ్యం) : చేపల కొలను : నీరు స్వచ్ఛంగా, నిశ్చలంగా ఉంటుంది. చేపలు అడుగున ఎక్కడో ఉంటాయి. నీటిని కదిలించు, చేపలు వెలుపలికి వస్తాయి. మరికొంత కదిపితే వాటికి కోపం వచ్చి నీటి పైభాగానికి వచ్చి, దగ్గరగా వచ్చినదాన్నల్లా కొరుకుతాయి—అప్పుడే ఎరను వుంచిన కొక్కెంతో సహా.

Reversal (ప్రతిక్రియ) :

1. అప్పుడప్పుడూ వ్యూహాత్మకంగా కోపాన్ని ప్రదర్శించడం ద్వారా నీకు మేలు జరిగే అవకాశం ఉంది.

2. షార్క్ చేప (ప్రమాదకర శత్రువు) ను ఎప్పుడూ రెచ్చగొట్టకు.


‘ద ఫార్టీ ఎయిట్ లాస్ ఆఫ్ పవర్’ పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 38 : అందరిలా ప్రవర్తించు

THINK AS YOU LIKE BUT BEHAVE LIKE OTHERS

నీకు నచ్చిన రీతిలో ఆలోచించు కానీ అందరిలానే ప్రవర్తించు


If you make a show of going against the times, flaunting your unconventional ideas and unorthodox ways, people will think that you only want attention and that you look down upon them. They will find a way to punish you for making them feel inferior. It is far safer to blend in and nurture the common touch. Share your originality only with tolerant friends and those who are sure to appreciate your uniqueness.


నీవు నీ ఆచారవిరుద్ధమైన భావాలనూ, సంప్రదాయ దూరమైన పద్ధతులనూ గొప్పలకుపోయి చాటుకోవడం ద్వారా కాలానికి విరుద్ధంగా నడచుకోవడాన్ని ప్రదర్శిస్తే, ప్రజలు నీవు నలుగురి దృష్టిని ఆకట్టుకోవడాన్నే కోరుకుంటున్నావనీ, తమను చులకనగా చూస్తున్నావనీ అనుకుంటారు. తమలో న్యూనతా భావం కలిగించినందుకుగానూ వారు ఏదో ఒక పద్ధతిలో నిన్ను శిక్షించాలని చూస్తారు. నలుగురిలా కనబడటాన్ని నీ ప్రవర్తనలో మిళితం చేసుకోవడం, పెంపొందించుకోవడం ఎంతో క్షేమకరం. సహించగలిగే స్నేహితులతో మరియూ నీ అద్వితీయతను తప్పకుండా అభినందించే వారితో మాత్రమే నీ నూతనత్వాన్ని పంచుకో.

సాదృశ్యం : నల్లగొఱ్ఱె (బ్లాక్ షీప్) : నల్లగొఱ్ఱెను తమకు చెందినది కాదనుకుని గొఱ్ఱెల మంద వదిలేస్తుంది. దానితో అది మందలో వెనుకబడిపోవడమో, లేక మందనుండి వేరై పోయి దూరంగా తిరుగాడుతుండటమో జరగడం వలన తోడేళ్ళ చేత చిక్కి తక్షణం వాటికి ఆహారమైపోతుంది. మందతో కలసి ఉండు—సంఖ్యలో రక్షణ ఉన్నది. నీ విభిన్నతను నీ ఆలోచనలకే పరిమితం చేయి, ఉన్నిలోనికి రానీయకు.

ప్రతిక్రియ : నీవు ఇప్పటికే ఒక సమున్నత స్థాయికి ఎదిగితే నీ ప్రత్యేకతను నీవు నిర్భయంగా ప్రకటించుకోవచ్చు. అలానే సమాజంలో పాతుకుపోయిన మూఢ భావాలు, సంస్కృతిలో పెరిగిన జీవరాహిత్యం మొదలైనవాటిని విమర్శించేవారికి కూడా ఎల్లప్పుడూ చోటు ఉంటుంది.


‘ద ఫార్టీ ఎయిట్ లాస్ ఆఫ్ పవర్’ పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Monday, January 26, 2009

Law 37: మనసుకు హత్తుకునే దృశ్యాలను సృజించు

CREATE COMPELLING SPECTACLES

బలమైన ముద్రవేసే దృశ్యాలను సృజించు


Striking imagery and grand symbolic gestures create the aura of power—everyone responds to them. Stage spectacles for those around you, then, full of arresting visuals and radiant symbols that heighten your presence. Dazzled by appearances, no one will notice what you are really doing.


మనసును తాకేరూపాలు, ప్రతీకాత్మకంగా ఉండే శోభాయమానమైన అంగవిన్యాసాలు శక్తి ప్రకాశాన్ని సృష్టిస్తాయి—ప్రతి ఒక్కరూ వాటికి స్పందిస్తారు. కట్టిపడేసేలా కనిపించే దృశ్యాలతో, ప్రకాశవంతమైన చిహ్నాలతో నీ చుట్టూ ఉండేవారికి ఆకట్టుకునే దృశ్యాలను ప్రదర్శించి, నీ ఉనికిని ఉన్నతం చేసుకో. కనబడే దృశ్యాలవలన కళ్ళుచెదరటంతో, నీవు నిజంగా ఏమి చేస్తున్నావన్న సంగతిని ఎవరూ గమనించరు.

సాదృశ్యం : శిలువ మరియు సూర్యుడు : శిలువ వేయడానికీ, సంపూర్ణ ప్రకాశానికీ ఇవి చిహ్నాలు. కానీ వీటిని ఒకదానిపై మరొకటి అమరిస్తే ఒక కొత్త వాస్తవం రూపుదాల్చుతుంది. ఒక నూతన శక్తి తలయెత్తి ప్రజామోదాన్ని పొందుతుంది. చిహ్నం—మరేవివరణా అవసరం లేదు.

ప్రతిక్రియ : ఈ నియమానికి ప్రతిక్రియ లేదు.


‘ద 48 లాస్ ఆఫ్ పవర్’ పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Sunday, January 25, 2009

Law 36: అల్పమైన సమస్యలను అలక్ష్యం చేయి

DISDAIN THINGS YOU CANNOT HAVE: IGNORING THEM IS THE BEST REVENGE

పొందలేని వాటికి విలువనివ్వకు: వాటిని అలక్ష్యం చేయటమే సరియైన ప్రతీకారం


By acknowledging a petty problem you give it existence and credibility. The more attention you pay an enemy, the stronger you make him; and a small mistake is often made worse and more visible when you try to fix it. It is sometimes best to leave things alone. If there is something you want but cannot have, show contempt for it. The less interest you reveal, the more superior you seem.


అల్పమైన ఒక సమస్యను గుర్తించడం ద్వారా నీవు దానికి ఉనికిని, విశ్వసనీయతను ఆపాదిస్తావు. ఒక శత్రువు గురించి నీవు ఎంతగా ఆలోచిస్తుంటే, అంతగా నీవు అతడిని బలవంతుడిని చేస్తావు. ఒక చిన్న తప్పు గురించి అదేపనిగా ఆలోచించడం వలన అది తరచుగా మరింత అధ్వాన్నంగా, మరింత స్పష్టంగా తయారవుతుంది. కొన్నిసార్లు విషయాలను వాటిమానాన వాటిని వదిలేయడం ఉత్తమం. నీవు కోరుకొని కూడా పొందలేనిది ఏదైనా ఉంటే, దానియెడల తిరస్కారాన్ని ప్రదర్శించు. నీవు ఎంత తక్కువ ఆసక్తిని చూపితే, అంత ఉన్నతుడిగా నీవు కనిపిస్తావు.

Image : చిన్నగాయం : అది చిన్నదేగానీ బాధాకరంగానూ, మంటగానూ ఉంటుంది. నీవు అన్ని రకాల మందులను ప్రయత్నిస్తావు, నీవు అందరికీ దాని గురించి చెబుతావు, నీవు దాన్ని గోకుతావు, దానిమీద కట్టిన చెక్కును పట్టుకుని పీకుతావు. వైద్యులు దానిని మరింత అధ్వాన్నంగా మాత్రమే మారుస్తారు. ఆ చిన్నగాయాన్ని కాటికి పోయేవరకూ తెస్తారు. ఆ గాయాన్ని దానిమానాన దానిని వదిలేస్తే, కాలం దానిని మాన్పి, నిన్ను బాధనుండి విముక్తుడిని చేస్తుంది.

Reversal : ఇప్పుడు చిన్నగా ఉండి, ముందుముందు పెరిగి పెద్దవయ్యే సూచనలున్న సమస్యలను ఎప్పుడూ అలక్ష్యం చేయకూడదు.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 35: సమయం మీద సాధికారతను సాధించు

MASTER THE ART OF TIMING

సమయానుకూలతను గ్రహించే నైపుణ్యాన్ని అలవరచుకో


Never seem to be in a hurry—hurrying betrays a lack of control over yourself, and over time. Always seem patient, as if you know that everything will come to you eventually. Become a detective of the right moment; sniff out the spirit of the times, the trends that will carry you to power. Learn to stand back when the time is not yet ripe, and to strike fiercely when it has reached fruition.


ఏదో తొందరలో ఉన్నట్లు ఎప్పుడూ కనబడకు—తొందర అనేది సమయం మీదా మరియూ నీమీద నీకూ నియంత్రణ లేని విషయాన్ని బహిర్గతం చేస్తుంది. చివరకు సమస్తం నీ వద్దకే వస్తుందన్నట్లుగా ఎల్లప్పుడూ స్థిమితంగా కనబడు. సరియైన సమయం యొక్క ఆచూకీ కనిపెట్టే పరిశోధకుడిగా మారు. వివిధ సమయాలలోని ‘స్ఫూర్తి’ యొక్క వాసనను పసిగట్టు. నిన్ను శక్తివంతునిగా మార్చే (అధికార పీఠం దరికి చేర్చే) ధోరణులను కనిపెట్టు. సమయం ఇంకా పక్వానికి రానపుడు వెనకన నిలవడం, అది పరిపక్వత చెందినపుడు ప్రచండంగా దాడి చేయడం నేర్చుకో.

Image : గ్రద్ద : అది తన తీక్షణమైన కళ్ళతో అంతా చూస్తూ, ఆకాశంలో చాలా ఎత్తున సహనంగా, నిశ్శబ్దంగా తిరుగుతూ ఉంటుంది. తాము మాటువేయబడ్డామన్న సంగతి క్రిందనున్న వాటికి తెలియదు. ఆక్షణం రాగానే గ్రద్ద అకస్మాత్తుగా క్రిందకు వచ్చి, ఎదురులేని వేగంతో తటాలున తన్నుకుపోతుంది. ఆ ప్రాణికి ఏంజరిగిందో తెలిసేలోపే ఆ పక్షి యొక్క పట్టకారులాంటి గోళ్ళు దానిని ఆకాశంలోకి తీసికెళ్ళిపోతాయి.

Reversal : There is no reversal to this law. సమయానుకూలత మీద నీకు ఎంతోకొంత పట్టు అవసరం. కాలమిచ్చేది నీవు స్వీకరిస్తుంటే, చివరకు ఆ కాలానికే దయలేకుండా బలైపోతావు.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 34 : రాజసాన్ని ప్రదర్శించు

BE ROYAL IN YOUR OWN FASHION: ACT LIKE A KING TO BE TREATED LIKE ONE

నీదైన విధానంలో రాజసంగా ఉండు: మహరాజులా మన్నింపబడటానికి మహారాజులా ప్రవర్తించు


The way you carry yourself will often determine how you are treated: In the long run, appearing vulgar or common will make people disrespect you. For a king respects himself and inspires the same sentiment in others. By acting regally and confident of your powers, you make yourself seem destined to wear a crown.


నీవు ఎలా ఆదరింపబడాలో తరచూ నిర్ణయించేది నీవు ప్రవర్తించే విధానమే. సాదాసీదా, మామూలు మనిషిలా కనిపించటం అనేది కాలక్రమంలో ప్రజలు నిన్ను అగౌరవంగా చూసేలా చేస్తుంది. ఒకరాజు తనను తాను గౌరవించుకొని, అదే భావన ఇతరులలోకూడా కలిగేటట్లుగా ప్రేరేపిస్తాడు. రాజసంగా మరియూ నీశక్తిమీద నీకు నమ్మకమున్నట్లుగా ప్రవర్తించడం ద్వారా కిరీటధారణ కొరకే ఉద్దేశింపబడిన వ్యక్తిగా నిన్ను నీవు కనబరచుకుంటావు.

Image : కిరీటం : దీనిని నీతల మీద ఉంచుకొని చూడు. ఫ్రశాంతమైన, అదేసమయంలో విశ్వాసం ద్యోతకమయ్యేదీ కూడా అయిన ఒక విభిన్నమైన స్థితిని నీవు అనుభూతి చెందుతావు. కిరీటాన్ని ధరించినపుడు ఎప్పుడూ సందేహాన్ని ప్రదర్శించకు, నీ హుందాతనాన్ని ఎప్పుడూ కోల్పోకు, లేదంటే ఆ కిరీటం నీకు నప్పదు. నీకన్నా విలువైన మరొకరికి ఉద్దేశింపబడినదిగా అది కనిపిస్తుంది. పట్టాభిషేకం కొరకు వేచిచూడకు. గొప్పగొప్ప చక్రవర్తులు కిరీటధారణను తమకు తామే గావించుకున్నారు.

Reversal : పరులను అవమానించడం ద్వారా నీవు ఉన్నతంగా కనబడాలని ఎప్పుడూ అనుకోకు. అలానే రాజసం పేరుతో ప్రజలనుండి వేరు పడిపోకు.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Saturday, January 24, 2009

Law 33 : ప్రతిమనిషి బలహీనతనూ కనిపెట్టు

DISCOVER EACH MAN’S THUMBSCREW

ప్రతిమనిషి బలహీనతనూ కనిపెట్టు


Everyone has a weakness, a gap in-the castle wall. That weakness is usually an insecurity, an uncontrollable emotion or need; it can also be a small secret pleasure. Either way, once found, it is a thumbscrew you can turn to your advantage.


కోటగోడలో సందులాగా ప్రతిఒకరూ ఒక బలహీనతను కలిగి ఉంటారు. ఆ బలహీనత సాధారణంగా ఒక అభద్రత, నియంత్రించలేని ఒక భావావేశం లేక అవసరం అయి ఉంటుంది. లేదంటే ఏదైనా చిన్న రహస్యమైన ఆనందం కూడా కావచ్చు. ఏదో ఒక పద్దతిలో దానిని నీవు తెలుసుకోగలిగితే, నీ ప్రయోజనం దిశగా దానిని వాడుకోవచ్చు.

Image : The Thumbscrew : నీ శత్రువు భద్రంగా కాపాడుకుంటూ కొన్ని రహస్యాలను కలిగి ఉంటాడు. బయటపడనివ్వని ఆలోచనలను యోచిస్తూ ఉంటాడు. కానీ తాను నిస్సహాయుడైన మార్గంలో అవి బయటపడుతూనే ఉంటాయి. అతని తలపైనో, హృదయంలోనో, పొట్టమీదో బలహీనత అనే ఒక గాడి ఉంటుంది. ఒకసారి నీవు ఆ గాడిని కనిపెట్టగలిగితే నీ బొటనవేలిని దానిలో ఉంచి నీ ఇష్టం వచ్చినట్లుగా అతనిని తిప్పవచ్చు.

Reversal : ఎదుటివారి బలహీనతలతో మరీ శృతిమించి వ్యవహరించకూడదు. ఒక్కోసారి ఆ బలహీనులు నీవు కూడా నియంత్రించలేనంతగా ప్రతిస్పందిస్తారు. అప్పుడు నీకే ప్రమాదం.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 32 : అభూత కల్పనల్లో విహరింపజేయి

PLAY TO PEOPLE’S FANTASIES

ప్రజలను కల్పనలలో విహరింపజేయి


The truth is often avoided because it is ugly and unpleasant. Never appeal to truth and reality unless you are prepared for the anger that comes from disenchantment. Life is so harsh and distressing that people who can manufacture romance or conjure up fantasy are like oases in the desert: Everyone flocks to them. There is great power in tapping into the fantasies of the masses.


నిజం అప్రియంగా, అసహ్యంగా ఉంటుంది కాబట్టి అది తరచూ దాటవేయబడుతూ ఉంటుంది. భ్రమలు తొలగిపోవడం వలన వచ్చే కోపానికి నీవు సిద్ధపడితే తప్ప నిజం గురించి, వాస్తవం గురించి మాట్లాడకు. జీవితం కర్కశమైనది మరియు బాధామయమైనది కనుక కాల్పనికతను నిర్మించేవారు, కట్టుకథల గారడీ చేసేవారు ఎడారిలో ఒయాసిస్సులా కనిపిస్తారు. ప్రతి ఒక్కరూ వారి చుట్టూ గుంపుగా చేరతారు. సామాన్య ప్రజల స్వైరకల్పనల నుండి చాలా శక్తిని పొందవచ్చు.

Image : There is no image for this law.

Reversal : ఇతరులను భ్రమల్లో విహరింపజేయడమనేది ఓ ఆటలా ఉండాలి. అది ప్రమాదకరంగా పరిణమించే అవకాశాల్లేకుండా జాగ్రత్త వహించు.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Friday, January 23, 2009

Law 31 : ఇతరుల నిర్ణయాలను నియంత్రించు

CONTROL THE OPTIONS: GET OTHERS TO PLAY WITH THE CARDS YOU DEAL

ప్రత్యామ్నాయాలను నియంత్రించు: ఇతరుల నిర్ణయాలు నీకు అనుకూలంగా ఉండేటట్లు చేయి


The best deceptions are the ones that seem to give the other person a choice: Your victims feel they are in control, but are actually your puppets. Give people options that come out in your favor whichever one they choose. Force them to make choices between the lesser of two evils, both of which serve your purpose. Put them on the horns of a dilemma: They are gored wherever they turn.


ఇతరులకు ఎంపిక చేసుకునే అవకాశం ఇచ్చినట్లు కనిపించే మోసాలే ఉత్తమమైన మోసాలు. నీ బాధితులు తాము నియంత్రిస్తున్నట్లు కనిపిస్తారు కానీ వారు నిజానికి నీ కీలుబొమ్మలు. ప్రజలు దేనిని ఎంచుకున్నప్పటికీ అది నీకు మేలు చేసే విధంగా ఉండే ప్రత్యామ్నాయాలను మాత్రమే వారికి ఇవ్వు. ప్రతి ఒకటీ నీ ప్రయోజనాన్నే కాపాడే విధంగా ఉన్న రెండు చెడులలో తక్కువ చెడును ఎంపిక చేసుకునేటట్లుగా వారిని బలవంత పెట్టు. సందిగ్ధమనే కొమ్ముల మధ్యన వారిని ఇరికించు. ఎటువైపు మళ్ళినా వారు కుమ్మివేయబడతారు.

Image : ఎద్దుకొమ్ములు : ఎద్దు తన కొమ్ములతో నిన్ను ఓ మూలకు పడతోస్తుంది. ఒక కొమ్మైతే ఎలాగో నీవు తప్పించుకోగలిగేవాడివి, కానీ అవి ఒక జత కొమ్ములు. అవి రెండూ నిన్ను తమ మధ్యన చిక్కించుకుని ఒడిసిపడతాయి. కుడివైపు పరుగిడినా, ఎడమవైపు పరుగిడినా రెండువైపులా కూడా చీల్చుకుపోయే వాటి కొనలవైపే కదలి, కుమ్మివేయబడతావు.

Reversal : ఒక్కోసారి నీవు ఇతరులకున్న ప్రత్యామ్నాయాలను నియంత్రించకుండా, తాత్కాలికంగా వారికి పూర్తి స్వేచ్ఛనిస్తే వారి మీద గూఢచర్యం నెరపటానికీ, విలువైన సమాచారం సేకరించడానికీ, ఎత్తుగడలను పన్నడానికీ నీకు అవకాశం లభిస్తుంది.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 30 : కష్టపడిపోతున్నట్లుగా కనబడకు

MAKE YOUR ACCOMPLISHMENTS SEEM EFFORTLESS

నీ పనులన్నీ సునాయాసంగా నెరవేరుతున్నట్లు చూపు


Your actions must seem natural and executed with ease. All the toil and practice that go into them, and also all the clever tricks, must be concealed. When you act, act effortlessly, as if you could do much more. Avoid the temptation of revealing how hard you work—it only raises questions. Teach no one your tricks or they will be used against you.


నీ చేతలన్నీ తప్పనిసరిగా సహజంగానూ, సునాయాసంగా నిర్వహింపబడుతున్నట్లుగానూ కనబడాలి. ఆ పనులు చేయడానికి నీవు పడ్డ శ్రమ, చేసిన సాధన, పన్నిన తెలివైన ఉపాయాలు అన్నింటినీ తప్పక రహస్యంగా ఉంచాలి. నీవు పనిచేసేటపుడు ఇంతకన్నా చాలా ఎక్కువగా చేయగలుగుతావన్నట్లుగా సునాయాసంగా పనిచేయి. నీవు ఎంత కష్టపడి పనిచేశావో తెలియజేయాలన్న ఆకర్షణకు లోనుగాకు. అది కేవలం ప్రశ్నలు తలయెత్తడానికి మాత్రమే దారితీస్తుంది. నీ ఉపాయాలను ఎవరికీ బోధించకు, లేదంటే అవి నీ మీదే ప్రయోగించబడతాయి.

Image : The Racehorse (పందెపు గుఱ్ఱం) : బాగా దగ్గరనుండి మనం ప్రయాసనూ, గుఱ్ఱాన్ని నియంత్రించడానికి చేసిన ప్రయత్నాన్నీ, శ్రమ, బాధలతో కూడిన శ్వాసనూ చూస్తాము. కానీ మనం కూర్చొని, తిలకిస్తున్న దూరంగా ఉండే ప్రదేశం నుండి అదంతా మనోహరంగా, గాలిలో ఎగిరిపోతున్నట్లుగా ఉంటుంది. ఇతరులను దూరంగా ఉంచితే వారు నీ కదలికలలో ఉండే సౌకర్యాన్ని మాత్రమే చూస్తారు.

Reversal : సమయాన్ని, సందర్భాన్ని బట్టి రహస్యాన్ని కొంత బహిర్గతం చేసినా మంచి ఫలితమే ఉంటుంది.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 29 : అంతిమఫలితం గురించి జాగ్రత్త వహించు

PLAN ALL THE WAY TO THE END

మొత్తం ప్రణాళికను అంతిమఘట్టం దిశగా సిద్ధంచేయి


The ending is everything. Plan all the way to it, taking into account all the possible consequences, obstacles, and twists of fortune that might reverse your hard work and give the glory to others. By planning to the end you will not be overwhelmed by circumstances and you will know when to stop. Gently guide fortune and help determine the future by thinking far ahead.


అంతిమఘట్టమే సమస్తం. అన్ని రకాల సంభావ్య పరిణామాలనూ, ఆటంకాలనూ, నీ కష్టమంతా వృధాయై, కీర్తి అంతా ఇతరులకు చెందేటట్లుగా అదృష్టం తిరగబడవచ్చనే విషయాన్నీ పరిగణనలోకి తీసుకుంటూ ప్రణాళికనంతా అంతిమఫలితం దిశగానే సిద్ధం చేయి. అంతిమఫలితం గురించి జాగ్రత్త వహించడం వలన పరిస్థితుల ద్వారా నీవు ప్రభావితుడవు కాకపోవడమే కాకుండా, ఎక్కడ ఆగిపోవాలో నీకు తెలుస్తుంది. దూరాలోచన ద్వారా భాగ్యరేఖకు సున్నితంగా మార్గం చూపి, భవిష్యత్తు నిర్ణయించడానికి సహాయం చేయి.

Image : The Gods on Mount Olympus : క్రింద మనుషులు చేసే పనులను మేఘాలలో నుండి చూస్తూ, వినాశనానికీ, విషాదానికీ దారితీసే ఆ గొప్ప కలలన్నింటి యొక్క అంతిమ ఫలితాన్ని ముందుగానే తెలుసుకుంటారు. ఆ క్షణాన్ని దాటి అవతలికి చూడలేని మన అశక్తతను చూచీ, మనల్ని మనం ఎలా మోసం చేసుకుంటామో చూచీ వారు నవ్వుకుంటారు.

Reversal : చివరంటా దృష్టిలో ఉంచుకొని ఎంత గొప్ప ప్రణాళికను సిద్ధం చేసుకున్నప్పటికీ, మార్గమధ్యంలో ఎదురయ్యే పరిస్థితులకు, ఆకస్మిక మార్పులకు అనుగుణంగా ప్రత్యామ్నాయాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 28 : ధైర్యంతో ముందడుగు వేయి

ENTER ACTION WITH BOLDNESS

కార్యరంగంలోకి ధైర్యంతో అడుగిడు


If you are unsure of a course of action, do not attempt it. Your doubts and hesitations will infect your execution. Timidity is dangerous: Better to enter with boldness. Any mistakes you commit through audacity are easily corrected with more audacity. Everyone admires the bold; no one honors the timid.


ఒక పని జరుగుతుందని నీకు నమ్మకం కలగకపోతే ఆ పని చేయటానికి ప్రయత్నించకు. నీ సందేహాలు, సంకోచాలు నీ కార్యనిర్వహణను చెడగొడతాయి. పిరికితనం ప్రమాదకరం : పనిలోకి ధైర్యంగా అడుగుపెట్టడం చాలా మంచిది. ధైర్యంతో నీవు ఏమైనా తప్పులు చేసినా కూడా మరింత ధైర్యంవలన అవి సులభంగా సరిదిద్దబడతాయి. ధైర్యంగలవారిని ప్రతిఒక్కరూ ప్రశంసిస్తారు. పిరికివారిని ఎవరూ గౌరవించరు.

Image : The Lion and the Hare : సింహం తన మార్గంలో ఎక్కడా ఆగదు. డాని కదలికలు చాలా వేగంగా ఉంటాయి. దాని దవడలు చాలా చురుకుగా, శక్తివంతంగా ఉంటాయి. పిరికి కుందేలు (చెవుల పిల్లి) ప్రమాదాన్ని తప్పించుకోవడానికి ఎమైనా చేస్తుంది. కానీ ఆ తప్పించుకునే, పారిపోయే తొందరలో అది మళ్ళీ ఉచ్చుల్లోకే పోతుంది. దాని శత్రువు దవడల మధ్యలోకే తటాలున గెంతుతుంది.

Reversal : నీవు అన్ని వేళలా ధైర్యంతోనే ఉండాలి, కానీ అన్ని వేళలా ధైర్యాన్ని ప్రదర్శించకూడదు. అలా ప్రదర్శిస్తే అది క్రూరత్వంగా కనిపించే ప్రమాదముంది. ధైర్యాన్ని సరైన సమయంలో వ్యూహాత్మకంగా వాడాలి. నీవు సిగ్గు, బిడియం నటించడం ద్వారా ప్రజలు నీ వద్ద సౌకర్యవంతంగా మసలుకోగలుగుతారు.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Sunday, January 18, 2009

Law 27 : ప్రజలను నమ్మించి లభ్దిపొందు

PLAY ON PEOPLE’S NEED TO BELIEVE TO CREATE A CULTLIKE FOLLOWING

ప్రజల యొక్క నమ్మేగుణం ద్వారా, ఆరాధించే అనుచరగణాన్ని తయారు చేసుకో


People have an overwhelming desire to believe in something. Become the focal point of such desire by offering them a cause, a new faith to follow. Keep your words vague but full of promise; emphasize enthusiasm over rationality and clear thinking. Give your new disciples rituals to perform, ask them to make sacrifices on your behalf. In the absence of organized religion and grand causes, your new belief system will bring you untold power.


ఏదో ఒకదానిలో నమ్మకాన్ని కలిగి ఉండాలనే ప్రబలమైన కోరిక ప్రజలకుంటుంది. ప్రజలకు ఓ ఉద్దేశ్యాన్ని, వారు అనుసరించడానికి ఒక కొత్త విశ్వాసాన్ని అందించడం ద్వారా అటువంటి కోరికకు కేంద్రబిందువుగా మారు. నీమాటలు ఇతిమిథ్థంగా ఉండకూడదు ..కానీ ఆశలు కల్పించేటట్లుగా ఉండాలి. యోచనలో స్పష్టత, తార్కికత తగ్గేంతగా ఉత్సుకతను పెంచాలి. నీ కొత్త శిష్యులు ఆచరించటానికి సంస్కారాలను రూపొందించి ఇవ్వు. నీతరపున త్యాగాలు చేయమని వారికి పిలుపునివ్వు. మరే ఉన్నతమైన ఉద్దేశ్యాలూ, మరే వ్యవస్థీకృత సిద్ధాంతమూ లేకపోవడంతో నీ కొత్త విశ్వాసపద్దతి నీకు చెప్పలేనంత శక్తిని తెచ్చిపెడుతుంది.

Image : అయస్కాంతం : కనబడని బలమొకటి వస్తువులను దీనివైపు లాగటంతో, ఆ వస్తువువులన్నీ కూడా అయస్కాంతబలాన్ని పొంది, తిరిగి మిగతా భాగాలను తమవైపు లాగడంతో మొత్తం అయస్కాంత శక్తి క్రమంగా పెరుగుతూ ఉంటుంది. అసలు అయస్కాంతాన్ని తొలగిస్తే ప్రభావమంతా పోతుంది. ప్రజల ఊహలను ఆకర్షించి, వారందరినీ కలిపిఉంచే కనపడనిబలంగా ఉండే అయస్కాంతంగా నీవు మారు. వారు నీ చుట్టూ గుంపు కట్టిన తరువాత ఏ శక్తీ నీనుండి వారిని దూరంగా లాగివేయలేదు.

Reversal : ఒక వ్యక్తిని మోసం చేయడం కష్టం. కానీ మోసం బయటపడితే పరిస్థితిని ఎదుర్కోవడం తేలిక. ఒక గుంపును మోసం చేయడం చాలా సులభం. కానీ మోసం బయటపడితే మాత్రం పరిస్థితిని ఎదుర్కోవడం చాలా కష్టం. వాళ్ళంతా కలసి నిన్ను ముక్కలు ముక్కలు చేసేస్తారు. కాబట్టి గుంపును డీల్ చేసేటపుడు ఎవరైనా నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారా.. అని ఎప్పుడూ నిఘా పెట్టిఉంచు. నీ మూటాముల్లె ఎప్పుడూ సర్దుకునే ఉండు. ఒకవేళ నీసంగతి బయటపడితే, ఆసమాచారం నీకు తెలిసిన మరుక్షణం అక్కడినుండి నిష్క్రమించు. (బాబా అవతారం ఎత్తినవారికి పరిస్థితి ఇంతవరకూ రాకపోవచ్చు)


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Saturday, January 17, 2009

Law 26 : నీ చేతులకు మట్టంటనీయకు

KEEP YOUR HANDS CLEAN

నీ చేతులకు మట్టంటనీయకు


You must seem a paragon of civility and efficiency: Your hands are never soiled by mistakes and nasty deeds. Maintain such a spotless appearance by using others as scapegoats and cat’s-paws to disguise your involvement.


పైకి నీవు సభ్యతకు, కార్యకుశలతకు ఒక నమూనాగా కనిపించాలి: తప్పులు మరియు అసహ్యకరమైన పనులమూలంగా నీ చేతికి ఎప్పుడూ మట్టంటకూడదు. నీ ప్రమేయాన్ని మరుగుపరచడానికి ఇతరులను బలిపశువులుగా, పావులుగా వాడుకోవడం ద్వారా నీవు మచ్చలేనివిధంగా కనిపించు.

Image : అమాయకమైన మేక (The Innocent Goat) : ప్రాయశ్చిత్తం రోజున (క్రైస్తవ మతానికి సంబంధించిన Day of Atonement) పెద్దపూజారి ఆలయంలోనికి మేకను తీసుకు వచ్చి, తన చేతులను దాని తలమీద పెట్టి, ప్రజల పాపాలన్నింటినీ ఒప్పుకుని, ఆ పాపమంతా ఏ పాపం ఎరుగని ఆ జంతువుకు బదిలీ చేస్తాడు. ఆ తరువాత ఆ మేక ఒక నిర్జనప్రదేశానికి తీసికెళ్ళబడి, అక్కడ వదిలివేయబడుతుంది. దానితో ప్రజల పాపాలన్నీ సమసిపోతాయి.

Reversal : చేసేతప్పు చేసేసి ఆ తరువాత పశ్చాత్తాపం నటించడం ద్వారా తప్పించుకునే అవకాశం ఉన్నపుడు ఆ పనిలో నీ ప్రమేయాన్ని దాయకపోయినా పరవాలేదు. అలానే క్రూరమైన పనులలో నీ హస్తం ఉందనే విషయం బయటపడేటట్లు చేయడంద్వారా నీవు ఇతరులను భయపెట్టవచ్చు. అయితే ఈ పద్దతులను తరచుగా ఆచరించకూడదు. ఎక్కువ సార్లు నీ ప్రమేయాన్ని దాచివేయడమే మంచిది.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 25 : నీవు ఎలాంటి వ్యక్తివో నీవే నిర్ణయించు

RE-CREATE YOURSELF

నిన్ను నీవు పునఃసృష్టి చేసుకో


Do not accept the roles that society foists on you. Re-create yourself by forging a new identity, one that commands attention and never bores the audience. Be the master of your own image rather than letting others define it for you. Incorporate dramatic devices into your public gestures and actions—your power will be enhanced and your character will seem larger than life.


సమాజం నీకు అంటగట్టే పాత్రలను అంగీకరించకు. అందరి దృష్టినీ ఆకట్టుకునేదేకాక, చూసేవారికి ఎప్పుడూ విసుగు తెప్పించని ఒక క్రొత్త గుర్తింపును కల్పన చేసుకోవటం ద్వారా నిన్ను నీవు పునఃసృష్టి చేసుకో. నీ స్వంత ఇమేజి మీద నీవే నియంత్రణను కలిగి ఉండు. అంతేగానీ దానిని ఇతరులను నిర్వచించనీయకు. నలుగురి ముందు నీవు ప్రదర్శించే హావభావాలలో, నీ చేతలలో ఆకట్టుకునే ఉపాయాలను చేర్చు—నీ శక్తి హెచ్చింపబడుతుంది. నీ ప్రవర్తన మహనీయంగా కనిపిస్తుంది.

Image : The Greek Sea-God Proteus : సమయానికి తగినట్లుగా తన రూపాన్ని మార్చుకునే సామర్ధ్యంలోనే ఈయన శక్తి అంతా ఉంది. Agamemnon యొక్క సోదరుడు Menelaus ఇతడిని పట్టుకోవడానికి ప్రయత్నించినపుడు Proteus తనను ముందు ఓ సింహంలా తరువాత క్రమంగా ఓ పాములా, ఓ చిరుతలా, ఓ పందిలా, ప్రవహించే నీరులా, చివరికి ఓ చెట్టులా రూపాంతరం చేసుకున్నాడు.

Reversal : ఈ సూత్రానికి reversal లేదు. అయితే ప్రవర్తనలో నాటకీయత శృతిమించకుండా జాగ్రత్తపడు.

The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 24 : దర్బారులో ఎలా మెలగాలో తెలుసుకో

PLAY THE PERFECT COURTIER

సరియైన ఆస్థానికుడిగా వ్యవహరించు


The perfect courtier thrives in a world where everything revolves around power and political dexterity. He has mastered the art of indirection; he flatters, yields to superiors, and asserts power over others in the most oblique and graceful manner. Learn and apply the laws of courtiership and there will be no limit to how far you can rise in the court.


ప్రతి విషయం అధికారం మరియు రాజకీయ దక్షతల చుట్టూ పరిభ్రమించే ప్రపంచంలో సరియైన ఆస్థానికుడు వర్ధిల్లుతాడు. అతను అన్నిరకాల కుటిల నీతులలో ఆరితేరి ఉంటాడు; ముఖస్తుతి చేస్తాడు, తన పైవారికి లోబడి ఉంటాడు, పైకి మనోహరంగా కనిపించే కుటిల పద్దతులలో ఇతరుల మీద తన అధికారాన్ని చాటుకుంటాడు. సరియైన ఆస్థానికుడిగా మెలగగలిగే సూత్రాలను తెలుసుకుని, వాటిని ఆచరణలో పెడితే ఆస్థానంలో నీవు ఎంత ఎత్తుకు ఎదుగుతావన్నదానికి హద్దే ఉండదు.

Image & Reversal : ఈ నియమం ఎంత ప్రాముఖ్యత కలిగినదంటే ఈ ఒక్క సూత్రం ద్వారానే ఇతరులతో నీవు మెలగవలసిన తీరుతెన్నులను, అలవరచుకోవలసిన లౌక్యాన్ని మరియు వ్యవహారదక్షతను చాలావరకూ ఔపోసన పట్టవచ్చు. ఈ నియమంతో పోల్చదగిన విషయమే ఈ ప్రపంచంలో లేదు. It is unique. ఇక Reversal గురించి ఆలోచించడమే వ్యర్ధమైన పని.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 23 : నీ శక్తులను ఒకేచోట కేంద్రీకరించు

CONCENTRATE YOUR FORCES

నీ బలగాలను కేంద్రీకరించు


Conserve your forces and energies by keeping them concentrated at their strongest point. You gain more by finding a rich mine and mining it deeper, than by flitting from one shallow mine to another—intensity defeats extensity every time. When looking for sources of power to elevate you, find the one key patron, the fat cow who will give you milk for a long time to come.


నీ బలగాలను, శక్తులను ఒకేఒక కీలకమైన అంశం మీద కేంద్రీకరించి ఉంచడం ద్వారా, అవి వ్యర్ధంకాకుండా సంరక్షించు. ఒక చిన్న గనినుండి మరో చిన్నగనికి గెంతడం ద్వారా కన్నా, ఒకేఒక సమృద్ధియైన గనిని కనుగొని దానినే లోతుగా తవ్వటంవలన నీవు చాలా ఎక్కువ లాభపడతావు—గాఢత, విస్తీర్ణతను ప్రతిసారీ జయిస్తుంది. నీవు ఎదగడానికి దోహదపడే శక్తివంతుల కొరకు నీవు చూస్తున్నపుడు నీకు చిరకాలంపాటు పాలిచ్చే కొవ్విన ఆవులాంటి ఒక కీలకమైన రాజపోషకుణ్ణి సంపాదించు.

Image : బాణం : ఒక బాణంతో నీవు రెండు లక్ష్యాలను కొట్టలేవు. నీ ఆలోచనలు దారి మళ్ళితే శత్రువు హృదయానికి పెట్టిన గురి తప్పుతుంది. మనసు, బాణం ఒకటే అయిపోవాలి. అటువంటి మానసిక, భౌతిక శక్తుల ఏకీకరణ ద్వారా మాత్రమే బాణం లక్ష్యాన్ని కొట్టి, శత్రువు హృదయాన్ని ఛేదించగలదు.

Reversal :

1. గెరిల్లా యుద్ధంలో ఎప్పుడూ ఏకీకరణ మంచిది కాదు. శక్తులన్నీ ఒకదానికొకటి దూరంగా ఉండటమే దానికి తగిన ఎత్తుగడ.

2. నీవు ఆధారపడిన ఒకేఒక రాజపోషకుడు ఏకారణం చేతనైనా నీకు దూరమైతే కష్టాల పాలౌతావు. కనుక మరికొందరు పోషకులను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకో.

3. కేంద్రీకరణ పేరుతో జీవితంలో వెరైటీని చేజార్చుకోకు.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Friday, January 16, 2009

Law 22 : లోబడి ఏమార్చు

USE THE SURRENDER TACTIC: TRANSFORM WEAKNESS INTO POWER

లొంగిపోయే వ్యూహాన్ని అనుసరించు: బలహీనతను బలంగా మార్చు


When you are weaker, never fight for honor’s sake; choose surrender instead. Surrender gives you time to recover, time to torment and irritate your conqueror, time to wait for his power to wane. Do not give him the satisfaction of fighting and defeating you—surrender first. By turning the other cheek you infuriate and unsettle him. Make surrender a tool of power.


నీవు బలహీనుడిగా ఉన్న సమయంలో ప్రతిష్టకు పోయి పోరాడటానికి బదులుగా లొంగిపోవడాన్ని ఎంచుకో. లోబడటం అనేది నీవు తిరిగి కోలుకునే సమయాన్ని, నీ విజేతను యాతనల పాలుచేసి, చీకాకు పెట్టే సమయాన్ని, అతని శక్తి హరించుకుపోయే వరకూ వేచి ఉండే సమయాన్ని నీకు ఇస్తుంది. నీతో పోరాడి, నిన్ను ఓడించిన తృప్తిని అతనికి ఇవ్వకు—ముందు లొంగిపో. ప్రతిఘటన లేకుండా (ముందు) లొంగిపోవడం ద్వారా (తరువాత) అతడిని నీవు రెచ్చగొట్టి, అస్థిరపరచవచ్చు. లోబడటాన్ని ఓ శక్తి సాధనంగా మలచుకో.

Image : ఓక్ వృక్షం : పెనుగాలికి ఎదురు నిలిచిన ఓక్ వృక్షం ఒకదాని తరువాత ఒకటిగా తన కొమ్మలన్నింటినీ పోగొట్టుకుని, తనను రక్షించడానికి ఏమీ మిగలక, చివరికి దాని మొదలు తటాలున విరిగిపోతుంది. కానీ వంగిన ఓక్ వృక్షం దాని మొదలు బాగా పెద్దదవుతుండగా, దాని వేళ్ళు లోతుగా, బాగా దృఢమైన పట్టుతో పెరుగుతుండగా దీర్ఘకాలం జీవిస్తుంది.

Reversal : బలవంతుడైన శత్రువుకు బలి అయిపోకుండా, లొంగిపోవడం ద్వారా నిన్నునీవు కాపాడుకోవచ్చు. కానీ శత్రువు నీవు లొంగిపోయినా కూడా విడవని కఠినుడైతే, అతనికి బలైపోవటం ద్వారా అతని మీద ప్రజాగ్రహం పెల్లుబికేటట్లు చేయవచ్చు. అయితే అదంతా చూడటానికి నీవు ఉండవు. కనుక ఈ reversal ను సాధ్యమైనంత వరకూ ఆచరించక పోవడమే మంచిది. వేచి చూడు! నీ శత్రువు ఎంత బలవంతుడైనా కాలం అతడిని బలహీనుడిని చేయవచ్చు.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 21 : తెలివి తక్కువగా కనిపించు

PLAY A SUCKER TO CATCH A SUCKER—SEEM DUMBER THAN YOUR MARK

అమాయకుడిని బుట్టలో వేసుకోవడానికి అమాయకుడిలా ప్రవర్తించు—అసలు కన్నా తక్కువగా (నోరు లేనివాడిలా) కనిపించు


No one likes feeling stupider than the next person. The trick, then, is to make your victims feel smart—and not just smart, but smarter than you are. Once convinced of this, they will never suspect that you may have ulterior motives.


తాను పక్క వ్యక్తికన్నా తెలివితక్కువ వాడిని అని భావించడం ఎవరికీ ఇష్టం ఉండదు. కనుక నీ victims ను తాము తెలివైన వారమని భావించేలా చేయి—కేవలం తెలివైన వారమనే కాక, నీకన్నా కూడా తెలివైన వారమని భావించేలా చేయి. ఓ సారి అలా భావించిన తరువాత నీ మనసులో వేరే ఆలోచనలు ఉండవచ్చని వారు ఎప్పటికీ అనుమానించరు.

Image : The Opossum : Opossum అనే జంతువు చనిపోయినట్లు కనిపించడం ద్వారా అమాయకత్వం నటిస్తుంది. అందువలన వేటగాళ్ళందరూ దానిని వదిలేస్తారు. వికృతంగా ఉండే ఆ మూఢ, పిరికి, అల్ప ప్రాణి తమను బురిడీ కొట్టించగలదని ఎవరు మాత్రం భావించగలరు?

Reversal : నీ తెలివితేటలను ప్రదర్శించుకోవడం వలన నీకు ఒరిగేదేమీ ఉండదు. నీవు అమాయకుడిగా ఉండటం వలన ఒకవేళ ప్రజలు నిజం తెలుసుకున్నా కూడా వారు నీ వినయాన్ని మెచ్చుకుంటారే తప్ప నష్టమేమీ ఉండదు. అయితే నీ కెరీర్ ప్రారంభ దశలో మాత్రం నీ తెలివితేటలను ప్రదర్శించుకోవలసి ఉంటుంది. అలాగే తెలివైన వాడిలా కనిపించడం ద్వారా ఒక్కోసారి చేసిన తప్పును సులభంగా కప్పిపుచ్చుకోవచ్చు.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 20 : ఏ పక్షానికీ కట్టుబడకు

DO NOT COMMIT TO ANYONE

ఏ ఒకరికీ కట్టుబడకు


It is the fool who always rushes to take sides. Do not commit to any side or cause but yourself. By maintaining your independence, you become the master of others—playing people against one another, making them pursue you.


అవివేకి మాత్రమే ఏదో ఒక పక్షంలో చేరిపోవడానికి పరుగులు తీస్తాడు. నీవు నీ స్వప్రయోజనానికి తప్ప ఏ పక్షానికీ కట్టుబడకు. నీ స్వతంత్రతను నిలుపుకోవడం ద్వారా మనుషులను ఒకరి మీదకు మరొకరిని ఉసిగొల్పి, వాళ్ళంతా సహాయం కోసం నీ వెంటబడేటట్లు చేయడం ద్వారా, నీవు ఇతరుల మీద పెత్తనం చెలాయించగలవు.

Image : యువరాణి : అందరి దృష్టీ ఆమె మీదే ఉంటుంది. అందరూ ఆమెనే కోరుకుంటారు.. అమెనే ఆరాధిస్తారు. ఆమె మాత్రం ఏ ఒక్కరికీ వశం కాకుండా అందరినీ తన చుట్టూ-తమ కక్ష్య (orbit) ను వీడీ పోలేని, ఆమెకు దగ్గరా కాలేని-గ్రహాల్లా తిప్పుకుంటూ ఉంటుంది.

Reversal : ఇది చాలా సున్నితమైన ఆట. దీనిని మరీ ఎక్కువ మందితో, మరీ ఎక్కువ కాలం ఆడకూడదు. వాళ్ళంతా ఒక నాటికి అసలు సంగతి గ్రహించి, అందరూ కలసి ఒక్కటై నీ మీదికే రాగలరు.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 19 : ఎవరితో వ్యవహరిస్తున్నావో తెలుసుకో

KNOW WHO YOU’RE DEALING WITH—DO NOT OFFEND THE WRONG PERSON

నీవు ఎవరితో వ్యవహరిస్తున్నావో తెలుసుకో—అనువుగాని వ్యక్తికి ఆగ్రహం తెప్పించకు


There are many different kinds of people in the world, and you can never assume that everyone will react to your strategies in the same way. Deceive or outmaneuver some people and they will spend the rest of their lives seeking revenge. They are wolves in lamb’s clothing. Choose your victims and opponents carefully, then—never offend or deceive the wrong person.


ప్రపంచంలో వివిధ రకాలైన వ్యక్తులు ఉంటారు. నీ ఎత్తుగడలకు అందరూ ఒకేలా స్పందిస్తారని ఎప్పుడూ అనుకోకు. కొందరు వ్యక్తులను గనుక నీవు మోసం చేసినా లేక మరేదైనా ద్రోహం చేసినా ఇక వారు తమ మిగిలిన జీవితాన్ని ప్రతీకార వాంఛతోనే గడుపుతారు. వారు గొర్రె ముసుగులో ఉన్న తోడేళ్ళ వంటివారు. నీ victims ను, నీ ప్రత్యర్ధులను జాగ్రత్తగా ఎంపిక చేసుకో. ఇక—అనువుగాని వ్యక్తికి ఎప్పుడూ ఆగ్రహం తెప్పించకు.. అటువంటి వ్యక్తిని ఎప్పుడూ మోసగించకు.

Image : వేటగాడు : అతడు తోడేలుకు, నక్కకు ఒకేరకమైన ఉచ్చును పన్నడు. తీసుకోవడానికి ఎవరూ లేని చోట అతడు ఎర వేయడు. అతడికి తాను వేటాడే జంతువు యొక్క అలవాట్లు, అది దాగుండే ప్రాంతాలు.. అన్నీ పూర్తిగా తెలుసుండి, ఆప్రకారమే వేటాడతాడు.

Reversal : This law has no reversal. సింహం ఏదో, గొర్రె ఏదో గుర్తించడం నేర్చుకో! లేదంటే మూల్యం చెల్లిస్తావు!


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 18 : ఏకాకిగా మారకు

DO NOT BUILD FORTRESSES TO PROTECT YOURSELF—ISOLATION IS DANGEROUS

రక్షణ కొరకు కోటలు నిర్మించుకోకు—వేరు పడటం ప్రమాదకరం


The world is dangerous and enemies are everywhere—everyone has to protect themselves. A fortress seems the safest. But isolation exposes you to more dangers than it protects you from—it cuts you off from valuable information, it makes you conspicuous and an easy target. Better to circulate among people, find allies, mingle. You are shielded from your enemies by the crowd.


ప్రపంచం ప్రమాదకరమైనది. శత్రువులు ఎల్లెడలా ఉంటారు. ప్రతి ఒకరూ తమను తాము రక్షించుకోవాలి. కోట చాలా సురక్షితంగా అనిపిస్తుంది. కానీ అందరి నుండీ వేరుపడటం అన్నది నిన్ను ప్రమాదాల నుండి రక్షించక పోగా మరిన్ని ప్రమాదాల చెంతకు చేరుస్తుంది. నీకు విలువైన సమాచారం ఏదీ లభించకుండా తెంచేస్తుంది. నీవు స్పష్టంగా కనపడేటట్లు, సులభంగా ఛేదింపబడేటట్లు చేస్తుంది. జనం మధ్యన సంచరించటం, స్నేహితులను సంపాదించుకొని అందరితో కలిసిపోవటం ఉత్తమం! గుంపు అనే కవచం ద్వారా నీ శత్రువుల నుండి నీకు రక్షణ లభిస్తుంది.

Image : కోట : ఎంతో ఎత్తున కొండ కొమ్మున ఉన్న కోట అధికార దర్పాలలోని ప్రజలు ద్వేషించే అంశాలకు చిహ్నంగా నిలుస్తుంది. దానితో నీమీద దాడికి వచ్చే మొదటి శత్రువుకే పట్టణ ప్రజలు నిన్ను పట్టిస్తారు. సలహాగానీ, సమాచారం గానీ దొరకక ఆ కోట శత్రువుల చేతికి సులువుగా చిక్కుతుంది.

Reversal : ఏదైనా కీలక విషయం గురించి గాఢంగా ఆలోచించి ఓ నిర్ణయానికి రావడానికి నలుగురి మధ్యలో ఏకాగ్రత కుదరదు. అటువంటి సందర్భాలలో కొంతకాలం ఒంటరిగా ఉండటంలో దోషం లేదు.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Thursday, January 15, 2009

Law 17 : ఇతరులను ఉత్కంఠకు గురిచేయి

KEEP OTHERS IN SUSPENDED TERROR: CULTIVATE AN AIR OF UNPREDICTABILITY

ఊహలకు అందకుండా ప్రవర్తిస్తూ ఇతరులను భయోత్పాతంలో ముంచెత్తు


Humans are creatures of habit with an insatiable need to see familiarity in other people’s actions. Your predictability gives them a sense of control. Turn the tables: Be deliberately unpredictable. Behavior that seems to have no consistency or purpose will keep them off-balance, and they will wear themselves out trying to explain your moves. Taken to an extreme, this strategy can intimidate and terrorize.


మనుషులు ఇతరుల చేతలను అవగతం చేసుకోవాలనే తరగని కోరిక అలవడిన జీవులు. నిన్ను అవగతం చేసుకోవడంలో వారు నీ మీద నియంత్రణను సాధించినట్లుగా భావిస్తారు. పరిస్థితిని మార్చు: నీవు వారికి అవగతం కాకుండా జాగరూకత వహించు. నిలకడగానీ, ఓ ఉద్దేశ్యంగానీ లేనట్లుగా కనిపించే ప్రవర్తన వాళ్ళను అస్థిరపరచడమే కాక నీ కదలికలను పసిగట్టే క్రమంలో వాళ్ళు క్షీణించి పోతారు. ఈ వ్యూహం ఒకానొక దశలో వారిని భయకంపితులను చేయగలుగుతుంది.

Image : తుఫాను : పడవ ప్రయాణంలో తుఫాను గాలిని ముందుగా పసిగట్టలేము. బారోమీటర్‌లో సూచిక హఠాత్తుగా పెరుగుతుంది. దిశలో, వేగంలో చెప్పలేని మార్పులు చోటుచేసుకుంటాయి. తుఫాను అనేది భయోత్పాతానికీ, గందరగోళానికీ బీజం వేస్తుంది. ఇక తరుణోపాయం లేనేలేదు.

Reversal : నీవు ఒకరి వద్ద పని చేస్తున్నపుడు నలుగురితో సామరస్యంగా ఉండవలసి వస్తుంది. ఆ సందర్భంలో ఈ విధంగా భయపెడితే చెల్లదు. నీవు ఓ ఉన్నత స్థానంలో ఉన్నపుడు మాత్రమే ఈ సూత్రాన్ని ఆచరించాలి.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 16 : నీ విలువ పెరగాలంటే అందుబాటులో ఉండకు

USE ABSENCE TO INCREASE RESPECT AND HONOR

మర్యాద, గౌరవం పెంచుకోవాలంటే అందుబాటులో ఉండకు


Too much circulation makes the price go down: The more you are seen and heard from, the more common you appear. If you are already established in a group, temporary withdrawal from it will make you more talked about, even more admired. You must learn when to leave. Create value through scarcity.


లభ్యత ఎక్కువగా ఉంటే ధర పడిపోతుంది. ఎంత ఎక్కువగా నీవు కనబడుతుంటే, నీ మాటలు వినబడుతుంటే నీవు అంత సాధారణంగా కనిపిస్తావు. నీవు ఒక సమూహంతో ఇప్పటికే పూర్తి స్థాయి సంబంధాలు ఏర్పరచుకుని ఉన్నట్లైతే కొంతకాలం వారికి కనబడకుండా ఉండటం వలన నీ యెడల మరింత ఆసక్తి ప్రదర్శింపబడుతుంది. నీవు మరింతగా ఆరాధింపబడతావు. ఎప్పుడు నిష్క్రమించాలో నీవు తప్పక నేర్చుకోవాలి. కొరత ద్వారా విలువను సృజించు.

Image : సూర్యుడు : కనిపించకుండా పోయినపుడే సూర్యుని విలువ అందరూ గ్రహిస్తారు. వర్షం పడే రోజుల సంఖ్య పెరిగేకొలదీ సూర్యుని కోసం తహతహ పెరిగిపోతూ ఉంటుంది. అదే సూర్యుడు రోజుల తరబడి ఎండ మండిస్తే ప్రజలు వేగి వేసారిపోతారు. నిన్ను నీవు దాచేసుకోవడం నేర్చుకుని నీ పునరాగమనాన్ని మనుషులంతా కాంక్షించేటట్లు చేయి.

Reversal : మనుషులతో సంబంధాలు ప్రాధమిక దశలో ఉన్నపుడు నీవు నిరంతరం కనిపించాలి. మొదటే నిష్క్రమిస్తే నీ విలువ పెరగకపోగా అందరూ నిన్ను మరచిపోతారు.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 15 : శత్రువును కోలుకోనీయకు

CRUSH YOUR ENEMY TOTALLY

శత్రువును పూర్తిగా నాశనం చేయి


All great leaders since Moses have known that a feared enemy must be crushed completely. (Sometimes they have learned this the hard way.) If one ember is left alight, no matter how dimly it smolders, a fire will eventually break out. More is lost through stopping halfway than through total annihilation: The enemy will recover, and will seek revenge. Crush him, not only in body but in spirit.


మోషే కాలం నుండి కూడా గొప్ప నాయకులంతా దెబ్బతిన్న శత్రువును తిరిగి కోలుకోకుండా పూర్తిగా నాశనం చేయాలన్న విషయాన్ని తెలుసుకున్నారు. (ఒక్కోసారి వారు చాలా కష్టాలపాలైన మీదట ఈ విషయాన్ని గ్రహించారు) ఒక్క చిన్న నిప్పురవ్వ మిగిలున్నా అది నివురు కప్పుకుని ఉన్నా కూడా చివరికి అగ్నికీలలు రగులుకుంటాయి. పూర్తిగా నాశనం చేయకుండా, కొంత దెబ్బతీసి వదిలేస్తే చాలా కోల్పోవలసి ఉంటుంది. శత్రువు కోలుకుంటాడు, ప్రతీకారం తీర్చుకుంటాడు. అతడిని నలిపేయి, ఒక్క శరీరాన్నే కాదు.. స్ఫూర్తిని కూడా.

Image : నలిగిన పాము : నీ కాలి క్రింద నలిగిన పాము ప్రాణాలతో గనుక మిగిలితే అది ఉవ్వెత్తున లేచి కాటేసి నీ శరీరంలో రెండింతల విషాన్ని నింపుతుంది. వదిలివేయబడ్డ శత్రువు స్వయానా నీవే జవజీవాలిచ్చిన సగం చచ్చిన పాము లాంటివాడు. కాలం గడిచే కొలదీ ఆ పాము విషం మరింత తీవ్రమవుతూ ఉంటుంది.

Reversal : నీ శత్రువు తనంత తానే నాశనమయ్యే పరిస్థితిలో ఉంటే అతడినలానే వదిలేయి. ఆ సమయంలో నీవు దాడికి వెళితే అతను వేరే దారిలేక సర్వశక్తులూ కూడదీసుకుని నీతో చాలా తీవ్రంగా పోరాడతాడు. అప్పుడు నీకే ప్రమాదం ముంచుకురావచ్చు. తిరిగి కోలుకుని పోరాడగల అవకాశాలున్న శత్రువును మాత్రమే నాశనం చేయి.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 14 : స్నేహితుడిలా కనిపించు, గూఢచారిలా పనిచేయి

POSE AS A FRIEND, WORK AS A SPY

స్నేహితుడిలా కనిపించు, గూఢచారిలా పనిచేయి


Knowing about your rival is critical. Use spies to gather valuable information that will keep you a step ahead. Better still: Play the spy yourself. In polite social encounters, learn to probe. Ask indirect questions to get people to reveal their weaknesses and intentions. There is no occasion that is not an opportunity for artful spying.


నీ ప్రతిద్వంది గురించి తెలుసుకోవడం చాలా ఆవశ్యకం. విలువైన సమాచారాన్ని తెలుసుకోవడానికి వేగులను ఉపయోగించు. అది నిన్ను ఓ అడుగు ముందు ఉంచుతుంది. స్వయంగా నీవే గూఢచారిగా మారటం ఇంకా ఉత్తమం. సంఘంలో మర్యాదపూర్వకంగా ఒకరినొకరు కలుసుకున్నపుడు శోధించడం నేర్చుకో! నీ ప్రత్యర్ధులు తమ బలహీనతలను, ఉద్దేశ్యాలను బయటపెట్టుకునేలా చేయడానికి పరోక్షంగా ఉండే ప్రశ్నలు అడుగు. చాకచక్యంగా గూఢచర్యం చేయడానికి అవకాశంగా మారని సందర్భమే లేదు.

Image : మూడవ కన్ను : అందరికీ రెండు కళ్ళుండే ఈ ప్రపంచంలో గూఢచర్యం అనే మూడవ కన్ను వలన నీకు ఆ దైవానికి ఉండే సర్వజ్ఞత సిద్ధిస్తుంది. నీవు ఇతరులకన్నా అవతలికి చూడటమే కాక వారి లోలోపలికి కూడా చూస్తావు. ఆ మూడవ కన్ను నుండి నీవు తప్ప మరెవ్వరూ సురక్షితులు కారు.

Reversal : నీవు ఇతరుల మీద గూఢచర్యం చేసినట్లే నీ మీద కూడా గూఢచారులు ఉంటారు. అలా నీమీద గూఢచర్యం చేసేవారికి తప్పుడు సమాచారం అందేటట్లు చేసి నీ ప్రత్యర్ధులను తప్పుదారి పట్టించడం ద్వారా లభ్దిపొందు.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 13 : సహాయం కావాలంటే ఆశలు కల్పించు, ప్రాధేయపడకు

WHEN ASKING FOR HELP, APPEAL TO PEOPLE’S SELF-INTEREST, NEVER TO THEIR MERCY OR GRATITUDE

సహాయం కోరేటపుడు ఎదుటివారి స్వీయ ప్రయోజనం గురించే మాట్లాడు, ఎప్పుడూ వారి కరుణ, కృతజ్ఞతల గురించి మాట్లాడకు


If you need to turn to an ally for help, do not bother to remind him of your past assistance and good deeds. He will find a way to ignore you. Instead, uncover something in your request, or in your alliance with him, that will benefit him, and emphasize it out of all proportion. He will respond enthusiastically when he sees something to be gained for himself.


సహాయం కొరకు నీకు ఎవరైనా పొత్తుదారుడు కావలసివస్తే అతనికి నీవు గతంలో చేసిన సహాయం, మంచి పనులు ఇవేమీ గుర్తుచేయాలనుకోకు. అలా చేస్తే అతను నిన్ను ఉపేక్షించటానికి దారి వెతుకుతాడు. అలా కాకుండా నీకు సహాయం చేయటంలో, నీతో పొత్తుపెట్టుకోవటంలో అతనికి ప్రయోజనం కలిగించే అంశం ఏదో ఉన్నట్లుగా చూపు. ఆ విషయం మిగతా విషయాలకన్నా అతని మనసుకు బాగా హత్తుకునేటట్లుగా నొక్కి చెప్పు. తాను పొందగలిగే అంశాన్ని అతను దర్శించినపుడు చాలా ఉత్సుకతతో స్పందిస్తాడు.

Image : A Cord that Binds : కరుణ-కృతజ్ఞత అనే తాడు చివికిపోయి ఉంటుంది. లాగితే అది సులువుగా తెగిపోతుంది. ఆపద సమయంలో అటువంటి తాడును ఎప్పుడూ వాడకు. పరస్పర స్వీయ ప్రయోజనం అనే తాడు బలమైన మోకు వంటిది. అంత తేలికగా తెగిపోదు. అది నీకు అనేక సంవత్సరాల పాటు ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

Reversal : కొందరు వ్యక్తులు స్వీయ ప్రయోజనాన్ని ఆశించరు. పైగా అది తమకు చిన్నతనంగా భావిస్తారు. వారు కేవలం తమ దయను, దాతృత్వాన్ని ప్రదర్శించాలని మాత్రమే అనుకుంటారు. అటువంటి వారిని సహాయం అడిగేటపుడు స్వీయప్రయోజనం గురించి మాట్లాడకు.. కేవలం ప్రాధేయపడు!


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Wednesday, January 14, 2009

Law 12 : నిజాయితీని, ఉదారతనూ ప్రదర్శించు

USE SELECTIVE HONESTY AND GENEROSITY TO DISARM YOUR VICTIM

నిజాయితీనీ, ఉదారతనూ తగిన విధంగా ప్రదర్శించి, ఎదుటి వారిని నీకు అనుకూలంగా మార్చుకో


One sincere and honest move will cover over dozens of dishonest ones. Open-hearted gestures of honesty and generosity bring down the guard of even the most suspicious people. Once your selective honesty opens a hole in their armor, you can deceive and manipulate them at will. A timely gift—a Trojan horse—will serve the same purpose.


చిత్తశుద్ధి మరియు నిజాయితీ కలిగిన ఒక్క పని మనం చేసిన లెక్కలేనన్ని తప్పులను కనపడకుండా చేస్తుంది. అందరినీ అనుమానించేవారు కూడా నిజాయితీ, ఉదారత లాంటి సుహృద్భావ చర్యల వలన నీకనుకూలంగా మారతారు. నీ నిజాయితీ వాళ్ళను నీకు అనుకూలంగా ఒకసారి మార్చిందంటే, ఇక ఆ తరువాత వాళ్ళను నీ ఇష్టం వచ్చినట్లుగా తప్పుదారి పట్టించవచ్చు. ‘సమయానికి తగిన బహుమతి’ ఇదే ప్రయోజనాన్ని నెరవేర్చుతుంది.

Image : The Trojan Horse (ప్రాచీన గ్రీకులు తమ శత్రువులైన ట్రోజన్లకు బహుమతిగా ఇచ్చిన చెక్క గుఱ్ఱం) : నీ ప్రత్యర్ధికి నీవు ఇచ్చే నిరాకరించలేని గొప్ప బహుమతిలో నీ అసలు ఎత్తుగడ దాగుంటుంది. అడ్డుగోడలు తొలగిపోయిన తరువాత దాగి ఉన్న విధ్వంసం బయటపడుతుంది.

Reversal : నీ నిజస్వరూపం బయటపడిన తరువాత ఎంత నిజాయితీగా ఉన్నా కూడా నిన్ను ఎవ్వరూ నమ్మరు. నీకు దీర్ఘకాల లేక శాశ్వత సంబంధాలున్న వారితో ఇలా ప్రవర్తించకు.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 11 : ఇతరులు నీ మీద ఆధారపడేటట్లుగా చేయి

LEARN TO KEEP PEOPLE DEPENDENT ON YOU

ఇతరులు నీ మీద ఆధారపడేటట్లుగా చేయటం నేర్చుకో!


To maintain your independence you must always be needed and wanted. The more you are relied on, the more freedom you have. Make people depend on you for their happiness and prosperity and you have nothing to fear. Never teach them enough so that they can do without you.


నీ అవసరం ఇతరులకు ఉన్నంత కాలం నీ స్వతంత్రత ఇనుమడిస్తుంది. ఇతరులు ఎంతగా నీ మీద ఆధారపడుతుంటే అంతగా నీవు స్వేచ్ఛను పొందుతావు. ఇతరులు తమ సంతోషసౌభాగ్యాలకొరకు నీ మీద ఆధారపడేటట్లుగా గనుక నీవు చేయగలిగితే ఇక నీకు ఢోకా ఉండదు. నీవు లేకుండా మనగలిగేంత విద్యను వారికి ఎప్పుడూ నేర్పకు.

Image : Vines with Many Thorns (ముళ్ళ తీగలు) : ముళ్ళ తీగలకు కిందనేమో వేళ్ళు లోతుగా, విస్తారంగా పెరిగిపోయి ఉంటాయి. పైనేమో పొదల్లోకి చొచ్చుకుపోయీ, చెట్ల చుట్టూ, స్తంభాల చుట్టూ, కిటికీ అంచులకు అల్లుకుపోయీ ఉంటాయి. వాటిని తొలగించాలంటే చాలా శ్రమించాలి. ముళ్ళ వలన రక్తం కూడా కారుతుంది. కనుక వాటిని అలా వదిలేయడమే మంచిది.(ఇతరుల మీద నీ పట్టు కూడా అలానే ఉండాలి)

Reversal : ఇతరులను నీ మీద ఆధారపడే విధంగా నీవు ప్రయత్నిస్తున్నావంటే ఎంత స్వేచ్ఛను అనుభవిస్తున్నప్పటికీ కొంత మేరకు వారి మీద నీవూ ఆధారపడుతున్నట్లే. అలా కూడా ఆధారపడకుండా పూర్తి స్వేచ్ఛ కోసం తపించకు. అటువంటి గుత్తాధిపత్యం, ఒంటరితనం మంచిది కాదు. కనుక ఈ సూత్రానికి Reversal ఉన్ననూ దానిని ఆచరించకపోవడమే మంచిది. ఎప్పుడూ Interdependence మాత్రమే సరియైనది.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 10 : దురదృష్టవంతులకు దూరంగా ఉండు

INFECTION : AVOID THE UNHAPPY AND UNLUCKY

అంటు : విచారగ్రస్తులకు, దురదృష్టవంతులకు దూరంగా ఉండు


You can die from someone else’s misery—emotional states are as infectious as diseases. You may feel you are helping the drowning man but you are only precipitating your own disaster. The unfortunate sometimes draw misfortune on themselves; they will also draw it on you. Associate with happy and fortunate instead.


ఇతరుల విషాదం మూలంగా నీవు సర్వం కోల్పోగలవు. ఎదుటివారి భావోద్వేగాలు మనకు రోగాల్లా అంటుకుంటాయి. నీవు ఆపదలోఉన్న వ్యక్తిని ఆదుకుంటున్నానని అనుకోవచ్చు, కానీ నీవు చేస్తున్నది నీ వినాశనాన్ని నీవే సిద్ధం చేసుకోవడం మాత్రమే. దురదృష్టవంతులు ఒక్కోసారి తాము దుస్థితిని కొనితెచ్చుకోవడమేకాక అది నిన్ను కూడా ఆవరించేటట్లు చేస్తారు. వీళ్ళకు బదులుగా సంతోషంగా, విజయవంతంగా జీవించే వారి సహవాసం చేయి.

Image : A Virus : నీకు కనపడకుండా, నీకు తెలియకుండా ఇది నీ శరీరంలోకి ప్రవేశించి, నిశ్శబ్దంగా, నెమ్మదిగా వ్యాపిస్తుంది. నీకు అంటుకున్న రోగం గురించి నీవు తెలిసుకునేలోపు అది నీ శరీరం లోతులకు వెళ్ళిపోయి ఉంటుంది.

Reversal : This law admits no reversal. తమ దుస్థితిని నీకు కూడా తగిలించే వారి సహవాసం వలన నీకెప్పుడూ మేలు జరగదు.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 9 : చేతలు జయిస్తాయి, మాటలు ఓడిపోతాయి

WIN THROUGH YOUR ACTIONS, NEVER THROUGH ARGUMENT

నీ చేతల ద్వారా విజయాన్ని సాధించు, వాదన ద్వారా ఎప్పుడూ వద్దు


Any momentary triumph you think you have gained through argument is really a Pyrrhic victory: The resentment and ill will you stir up is stronger and lasts longer than any momentary change of opinion. It is much more powerful to get others to agree with you through your actions, without saying a word. Demonstrate, do not explicate.


వాదన ద్వారా ఏదైనా స్వల్పకాల విజయాన్ని నీవు పొందినప్పటికీ దాని కోసం నీవు చాలా కోల్పోవలసి ఉంటుంది. నీ వాదన వలన ఎదుటివారి అభిప్రాయంలో కలిగే మార్పు తాత్కాలికం, కానీ వారిలో చెలరేగే కోపం, అసహనం మాత్రం దీర్ఘకాలం పాటు చాలా బలంగా ఉండిపోతాయి. కనుక నీవు ఒక్క మాటకూడా మాట్లాడకుండా, నీ చేతల ద్వారా ఎదుటివారు నీతో ఏకీభవించేటట్లు చేసుకోవటం చాలా ఉత్తమం. దేనినైనా చేసి చూపు, అంతేకానీ సోది చెప్పకు.

Image : The See-saw (పార్కుల్లో ఇద్దరు పిల్లలు చెరొక పక్క కూర్చుని క్రిందకు, పైకి ఊగే పొడవైన బల్ల) : నీవు ఎవరితోనైనా వాదనకు దిగితే నీ పరిస్థితి వారితో కలసి See-saw ఊగినట్లే ఉంటుంది. కిందకు రావడం, పైకి పోవడం; మరలా కిందకు రావడం, మరలా పైకి పోవడం.. ఎంతసేపూ ఇలానే ఉంటుంది తప్ప ఏ ప్రయోజనమూ ఉండదు. దీనికి ముగింపు పలకడానికి నీవు చేయవలసినదల్లా ఒక్కటే. భూమిని తన్నవలసిన పనిగానీ, బల్లను కిందకు నొక్కవలసిన పనిగానీ లేకుండా ఎదుటి వానిని పైనే వదిలేసి నీవు మౌనంగా See-saw మీద నుండి దిగి పక్కన నిలబడు. దానితో ఆ ఎదుటివాడు కూడా కిందకు దిగిరాక తప్పదు.

Reversal : నీవు ఏదైనా తప్పుచేసి పట్టుబడినట్లైతే వితండంగా వాదించు. నీవు ఎస్కేప్ అవడానికి తగిన సమయం నీకు లభించవచ్చు.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Tuesday, January 13, 2009

Law 8 : ఎరవేసి రప్పించు

MAKE OTHER PEOPLE COME TO YOU—USE BAIT IF NECESSARY

ప్రత్యర్ధిని నీవద్దకు రప్పించు--అవసరమైతే ఎరవేయి


When you force the other person to act, you are the one in control. It is always better to make your opponent come to you, abandoning his own plans in the process. Lure him with fabulous gains—then attack. You hold the cards.


నీ ప్రత్యర్థి తప్పటడుగు వేసేటట్లుగా నీవు గనుక పురికొల్పగలిగితే మొత్తం పరిస్థితి నీ నియంత్రణలోకి వస్తుంది. నీ ప్రత్యర్ధి తన ప్రణాళికలోని అన్ని పథకాలను వదిలేసి నీ వద్దకు వచ్చేటట్లుగా చేయి. అతనికి అనేక లాభాలున్నట్లుగా ఊరించి, ఆపై దాడి చేయి. నీది పైచేయి అవుతుంది.

Image : The Honeyed Bear Trap (ఎలుగుబంటి-తేనెఉచ్చు) : వేటగాడు ఎలుగుబంటిని వెంటాడడు. ఎందుకంటే ఎలుగుబంటిని వెంటాడి పట్టుకోవడం దాదాపూ అసాధ్యమేకాక పారిపోయేదారి లేనపుడు అది చాలా క్రూరంగా ఎదురుదాడి చేస్తుంది. అందువలన వేటగాడు దానిని వెంటాడటం బదులుగా తేనెతో ఎరవేసి ఉచ్చు పన్నుతాడు. దానిని వెంటాడుతూ అలసిపోవడం, ప్రమాదానికి సిద్ధపడటం లాంటివేమీ చేయడు. కేవలం ఎరవేస్తాడు. తదుపరి వేచి ఉంటాడు.

Reversal : ప్రత్యర్ధిని నీవద్దకు రప్పించడం కాకుండా నీవే హఠాత్తుగా నీ ప్రత్యర్ధిమీద దాడి చేయడం ద్వారా కూడా ఓడించవచ్చు. సందర్భాన్ని బట్టి నడచుకోవాలి.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 7 : శ్రమ ఇతరులది—లాభం నీది

GET OTHERS TO DO THE WORK FOR YOU, BUT ALWAYS TAKE THE CREDIT

నీ పనిని ఇతరులచేత చేయించు. కానీ లాభం మాత్రం ఎప్పుడూ నీవే పొందు.


Use the wisdom, knowledge, and legwork of other people to further your own cause. Not only will such assistance save you valuable time and energy, it will give you a godlike aura of efficiency and speed. In the end your helpers will be forgotten and you will be remembered. Never do yourself what others can do for you.


ఇతరుల జ్ఞానం, విజ్ఞానం, కృషి నీకు ఉపయోగపడేటట్లుగా మలచుకో! ఇలా ఇతరుల నుండి సహాయం పొందటం వలన నీకు విలువైన సమయం, శక్తి అన్నీ కలసి రావడమేకాక సామర్ధ్యం మరియు వేగంలతో కూడుకున్న అద్వితీయమైన ప్రతిభ నీ స్వంతం అవుతుంది. ప్రజలు చివరికి నీ సహాయకులందరినీ మరచిపోయి నిన్ను మాత్రమే గుర్తుంచుకుంటారు. ఇతరులు చేయగలిగే నీ పనిని నీవు ఎప్పుడూ స్వయంగా చేయవద్దు.

Image : రాబందు : అడవిలోని జంతువులన్నింటికన్నా ఇది చాలా సులభంగా ఆహారం సంపాదించుకుంటుంది. ఇతర జంతువుల శ్రమ దీని స్వంతమవుతుంది. బ్రతుకు పోరాటంలో వాటి అపజయం దీని ఆకలి తీరుస్తుంది. నీవు శ్రమించేటపుడు ఏదైనా రాబందు నీ నెత్తిమీద తిరుగుతుందేమో ఓ కన్నేసి ఉంచు. ఒక వేళ ఉంటే మాత్రం వాడితో పోట్లాడకు. వాడితో చేతులు కలుపు. నీకు మరింత ఆహారం దొరకవచ్చు.

Reversal : నీక్రింది వారి శ్రమను మాత్రమే నీవు ఈ విధంగా స్వంతం చేసుకోగలవు. నీకు బాస్ ఉంటే మాత్రం పూర్తిగా నీవు చేసిన పనిలో కూడా కొంత క్రెడిట్ ఆయన కివ్వటం నేర్చుకో!


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 6 : చుక్కల్లో చంద్రుడులా వెలుగొందు

COURT ATTENTION AT ALL COST

అందరి దృష్టినీ ఆకట్టుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నించు


Everything is judged by its appearance; what is unseen counts for nothing. Never let yourself get lost in the crowd, then, or buried in oblivion. Stand out. Be conspicuous, at all cost. Make yourself a magnet of attention by appearing larger, more colorful, more mysterious than the bland and timid masses.


ప్రతిదాని విలువా అది కనబడే విధానాన్ని బట్టే నిర్ణయించబడుతుంది. కనపడని దానిని ఎవరూ లెక్కలోకి తీసుకోరు. ఏ ప్రత్యేక గుర్తింపు లేకుండా ఎప్పుడూ గుంపులో కలసిపోకు. ఎందుకంటే గుంపులో గోవిందయ్యలను ఎవరూ పట్టించుకోరు. ఎల్లప్పుడూ ప్రత్యేకంగా కనిపించు. ఎవరి దృష్టినైనా తటాలున ఆకర్షించేటట్లుగా ఉండటానికి అన్నివిధాలుగా ప్రయత్నించు. ఆకట్టుకునే శక్తిలేని మందలోమనిషిలా కాకుండా తళుకు బెళుకులతో, డాబుదర్పాలతో, ఓ పట్టాన అర్థంకాని వ్యక్తిలా ప్రవర్తిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించే ఓ సూదంటురాయిలా నిన్నునువ్వు మార్చుకో!

Image : The Limelight : (రంగస్థలం అంతా చీకటిగా ఉన్నఫుడు ఒకేఒక చోట ఫోకస్ చేసే సన్నని లైట్‌ను Limelight అంటారు) స్టేజ్ మీద Limelight ను ఏ నటుడి మీదకు ఫోకస్ చేస్తే ఆ నటుడే అందరికీ కనపడతాడు. అందరి కళ్ళూ అతని మీదే ఉంటాయి. Limelight యొక్క సన్నని వెలుగులో ఎప్పుడూ ఒక నటుడు మాత్రమే ఉండగలడు. ఆ కాంతి నీమీద ఫోకస్ చేయబడటానికి ఎలాగైనా ప్రయత్నించు. నీ నటన, హావభావాలు ఆకట్టుకొనే విధంగా ఉన్నట్లైతే ఆ Limelight ఎప్పుడూ నీమీదికే ఫోకస్ చేయబడుతుంది. దానితో అందరికీ నీవొక్కడివి మాత్రమే కనబడతావు. మిగతా నటులంతా చీకట్లోనే ఉండిపోతారు.

Reversal : సాధారణమైన ప్రజలముందే తప్ప శక్తివంతులముందు ఎప్పుడూ కూడా వెలుగొందాలని ప్రయత్నించకు. వారు ఆగ్రహిస్తే ప్రమాదంలో పడతావు. వారి సమక్షంలో నీవు తెరచాటుకు వెళ్ళిపో!


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Monday, January 12, 2009

Law 5 : ప్రఖ్యాతిని ప్రాణసమానంగా కాపాడుకో!

SO MUCH DEPENDS ON REPUTATION—GUARD IT WITH YOUR LIFE

ప్రఖ్యాతి మీద ఎంతో (నీ జీవితం) ఆధారపడి ఉంటుంది. దానిని ప్రాణసమానంగా కాపాడుకో!


Reputation is the cornerstone of power. Through reputation alone you can intimidate and win; once it slips, however, you are vulnerable, and will be attacked on all sides. Make your reputation unassailable. Always be alert to potential attacks and thwart them before they happen. Meanwhile, learn to destroy your enemies, by opening holes in their own reputations. Then stand aside and let the public opinion hang them.


ప్రఖ్యాతి (Reputation) శక్తికి మూలస్థానం. ఒక్క ప్రఖ్యాతితోనే నీవు నీ ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి, వారి మీద విజయాన్ని సాధించగలవు. ఒకసారి దానిని గనుక పోగొట్టుకుంటే నీవు బలహీనుడవైపోతావు. అన్నివైపులనుండి నీమీద దాడి జరుగుతుంది. నీ ప్రఖ్యాతిని దృఢంగా, దుర్గమంగా నిర్మించుకో! దానిమీద దాడి జరగబోయే అవకాశాలను ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండు.. వాటిని ఆదిలోనే తిప్పికొట్టు. అదే సమయంలో నీ ప్రత్యర్థుల ప్రఖ్యాతిని చెడగొట్టడం ద్వారా వారిని ఎలా చిత్తు చేయాలో తెలుసుకో! ఒక సారి వారి Reputation ను గనుక నీవు చెడగొట్టగలిగినట్లైతే.. ఇక ఆతరువాత ప్రజల్లో పలుకుబడి కోల్పోవటం మూలంగా వారి పతనం దానంతటదే జరిగిపోతుంది.

Image : వజ్రాలగని : నీవు శ్రమించి ఓ వజ్రాలగనిని కనుగొంటావు. దానిని నీ సొంతం చేసుకుంటావు. కానీ అప్పటి నుండి నీవు దానిని నీ ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడుకోవాలి. ఎందుకంటే దానిని నీనుండి చేజిక్కించుకోవడానికి దొంగలు, దోపిడీగాండ్రు అన్ని వైపులనుండి కాచుకొని ఉంటారు. ఆ వజ్రాలగని ఎప్పటికీ ఇక నీదే అవుతుందనీ, నీవెప్పటికీ ఇక ధనవంతుడవే అనీ భావించి అజాగ్రత్తగా ఉండకు. దానిని నిరంతరం కాపాడుకుంటూనే ఉండాలి. కాలగతిలో మెరుపు తగ్గిన ఆభరణం ఎవరి దృష్టినీ ఆకట్టుకోలేదు. ప్రఖ్యాతిని గనుక పోగొట్టుకుంటే నీ గతీ అంతే!

Reversal : There is no possible Reversal to this Law. నీవు ఏదో ఒక విషయంలో ఎంతోకొంత reputation సాధించగలిగితేనే ఉపయోగం ఉంటుంది.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 4 : ఎల్లప్పుడూ క్లుప్తంగా మాట్లాడు

ALWAYS SAY LESS THAN NECESSARY

ఎల్లప్పుడూ క్లుప్తంగా మాట్లాడు


When you are trying to impress people with words, the more you say, the more common you appear, and the less in control. Even if you are saying something banal, it will seem original if you make it vague, open-ended, and sphinxlike. Powerful people impress and intimidate by saying less. The more you say, the more likely you are to say something foolish.


మాటలతో ఎదుటివారిని ఆకట్టుకోవాలని నీవు ప్రయత్నించేటపుడు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత సాధారణంగా, అంత మామూలుగా నీవు కనపడతావు. నీ నియంత్రణలో ఏమీ ఉండదు. కానీ నీవు తక్కువ మాట్లాడటం ద్వారా ఒక విషయాన్ని అస్పష్టంగా, అనేకార్థాలు వచ్చేటట్లుగా, పజిలింగ్‌గా చెబితే అది అందరికీ తెలిసిన మామూలు విషయమైనా కూడా చాలా కొత్తగా, ఆకర్షణీయంగా అనిపిస్తుంది. శక్తివంతులైన వారు తక్కువ మాట్లాడటం ద్వారా ఎదుటివారిని ఆకట్టుకుంటారు ..భయపడేటట్లు చేస్తారు. నీవు ఎక్కువ మాట్లాడే కొలదీ నీవు మాట్లాడినదంతా పిచ్చి ప్రేలాపనే అవుతుంది.

Image : The Oracle at Delphi (ప్రాచీన గ్రీకు దేశంలో భక్తులు వేసే ప్రశ్నలకు దేవుడు పూజారి ద్వారా అంతరార్థంతో కూడిన (అర్థం కాని) సమాధానాలు ఇచ్చే ప్రదేశం) : భక్తులు Oracle కు వచ్చి ప్రశ్నించినపుడు పూజారులు మార్మికతతో కూడిన పజిలింగ్ మాటలేవో ఉచ్ఛరిస్తారు. ఆ మాటలు ఎంతో అంతరార్థాన్ని కలిగి ఉన్నట్లుగా అనిపిస్తాయి. ఆ మాటలను ఎవరూ అతిక్రమించరు. ప్రతి ఒక్కరూ తలదాల్చుతారు. చావైనా, బ్రతుకైనా ఆ మాట ప్రకారమే జరగాలి.

Reversal : మన క్రింది వారి వద్దనే మన మౌనం, క్లుప్తత మనకనుకూలంగా పనిచేస్తాయి. కానీ మన superiors యెడల ఇవి అలా పనిచేయవు. పైగా మన మీద వారికి ఎన్నో అనుమానాలు కలిగేటట్లు చేస్తాయి. కనుక ఆ సందర్భంలో ఎంత ఎక్కువ మాట్లాడి వారిని మనం ఏమార్చగలమో అంత ఎక్కువ మాట్లాడాలి. కాబట్టి ఏదైనా సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ప్రవర్తించాలి.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 3 : నీ ఉద్దేశ్యాలను వెల్లడి చేయకు

CONCEAL YOUR INTENTIONS

నీ ఉద్దేశ్యాలను వెల్లడి చేయకు


Keep people off-balance and in the dark by never revealing the purpose behind your actions. If they have no clue what you are up to, they cannot prepare a defense. Guide them far enough down the wrong path, envelope them in enough smoke, and by the time they realize your intentions, it will be too late.


నీవు చేస్తున్న పనులలోని ఆంతర్యమేమిటో నీ ప్రత్యర్థులకు ఎప్పుడూ తెలియనీయకు. వారినలాగే అర్థం కాని స్థితిలోనే ఉంచు. నీ ప్రత్యర్థులకు నీ ఉద్దేశ్యాల గురించి ఎటువంటి సమాచారం లేనపుడు వారు నిన్ను దెబ్బతీయడానికి గానీ, నిన్ను ఎదుర్కోవడానికి గానీ ఎటువంటి వ్యూహాన్నీ పన్నలేరు. అవసరమైతే వాళ్ళను తప్పుదారి పట్టించు. ఆ తప్పుదారిలోనే వాళ్ళు ముందుకెళ్ళేటట్లు చేయి. వాళ్ళను ఆ చీకట్లోనే, ఏమీ కనపడని ఆ పొగమంచులోనే ఉండనివ్వు. వాళ్ళు ఎప్పటికోగానీ అసలు సంగతిని కనుగొనలేరు. కానీ అప్పటికి నీవు నీ లక్ష్యాన్ని సాధించేసి ఉంటావు.

Image : మేకతోలు : మేక ఎప్పుడూ వేటాడదు ..ఎప్పుడూ మోసం చేయదు. మేక ఒక అమాయక మూగప్రాణి. కనుక దానిని ఎవ్వరూ అనుమానించరు. ఒక నక్క కనుక మేకతోలు కప్పుకుంటే అది కోళ్ళషెడ్‌లోకి నిరాటంకంగా వెళ్ళిపోవచ్చు.

Reversal : ఒకే మనుషుల వద్ద ఈ వ్యూహం ఎక్కువ సార్లు పనిచేయదు.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Law 2: స్నేహితులను అతిగా నమ్మకు

NEVER PUT TOO MUCH TRUST IN FRIENDS, LEARN HOW TO USE ENEMIES

స్నేహితులను ఎప్పుడూ అతిగా నమ్మకు. నీ శత్రువు కూడా నీకు ఉపయోగపడగలడని తెలుసుకో!


Be wary of friends--they will betray you more quickly, for they are easily aroused to envy. They also become spoiled and tyrannical. But hire a former enemy and he will be more loyal than a friend, because he has more to prove. In fact, you have more to fear from friends than from enemies. If you have no enemies, find a way to make them.


స్నేహితులతో జాగ్రత్తగా ఉండు--వారు నీకెప్పుడైనా నమ్మక ద్రోహం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వారికి నీ యెడల లోలోపల అసూయ ఉంటుంది. దానితో వారు సమయం వచ్చినపుడు నీ యెడల కనీసం జాలి కూడా చూపరు. కానీ అదే సమయంలో గతంలో నీకు ప్రత్యర్థిగా, శత్రువుగా ఉన్నవాని సహాయం గనుక నీవు అర్ధిస్తే అతను నీకు మనస్పూర్తిగా సహాయం చేస్తాడు. ఎందుకంటే ఒకనాటి శత్రువు కనుక మనతో అతని స్నేహాన్ని నిరూపించుకోవటానికి అతను చాలా ఎక్కువ ప్రేమను చూపవలసి ఉంటుంది. నిజానికి క్లిష్టసమయాలలో శత్రువుల కన్నా స్నేహితుల నుండే మనకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉంటుంది. కనుక నీకెవరూ శత్రువులు, ప్రత్యర్ధులు లేకపోతే ఏదోవిధంగా వాళ్ళను తయారు చేసుకోవడానికి ప్రయత్నించు.

Image : The Jaws of Ingratitude : సింహం నోట్లో వేలు పెడితే ఏమి జరుగుతుందో నీకు తెలుసు కనుక నీవు దానికి దూరంగా ఉంటావు. కానీ నమ్మిన స్నేహితులతో నీవు ఆవిధమైన జాగ్రత్తతో ప్రవర్తించవు. కనుక వాళ్ళు కృతఘ్నతతో అదను చూసి నిన్ను బ్రతికుండగానే నమిలి మింగేస్తారు.

Reversal : ఒక్కోసారి మనం నమ్మిన స్నేహితుల వలన ముంచుకొచ్చే ప్రమాదాలను హెచ్చరించడానికే ఈ సూత్రం చెప్పబడింది కానీ స్నేహితులెప్పుడూ అలానే ప్రవర్తిస్తారని అర్థం కాదు.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1, Link 2

Sunday, January 11, 2009

Law 1: బాస్‌ను ఎప్పుడూ డామినేట్ చేయకు

NEVER OUTSHINE THE MASTER

బాస్‌ను ఎప్పుడూ డామినేట్ చేయకు


Always make those above you feel comfortably superior. In your desire to please or impress them, do not go too far in displaying your talents or you might accomplish the opposite-inspire fear and insecurity. Make your masters appear more brilliant than they are and you will attain the heights of power.


నీ పైవారిలో 'నీ కన్నా తామే అధికులం’ అనే భావం కలిగేటట్లుగానే ఎల్లప్పుడూ ప్రవర్తించు. వారి వద్ద మంచి మార్కులు కొట్టేద్దామనే ఉద్దేశ్యంతోనైనా సరే నీ నైపుణ్యాలను అవసరానికి మించి మరీ ఎక్కువగా ప్రదర్శించకు. అలా చేస్తే మార్కులు రాకపోగా వ్యతిరేక ఫలితాన్ని సైతం పొందే అవకాశం ఉంటుంది. వారిలో భయం, అభద్రత మొదలైన భావాలను కలిగించగలవు. (ఆ భావాలు నీకు ప్రమాదకరంగా పరిణమించగలవు) ఎప్పుడూ నీ బాసే నీకన్నా తెలివైనవాడు.. ఆయన సలహా, మార్గదర్శకత్వం లేనిదే నీవేమీ చేయలేవు అనే భావాన్ని మాత్రమే కలిగించు. కెరీర్‌గ్రాఫ్‌లో నీ వృద్ధికి అడ్డే ఉండదు.

Image: ఆకాశంలో నక్షత్రాలు : ఆకాశంలో ఒక్క సూర్యుడే ప్రకాశించగలడు. ఆ ప్రకాశాన్ని ఎప్పుడూ మరగునపడేటట్లు చేయకు. ఆ ప్రకాశంతో ఎప్పుడూ పోటీపడకు. పగటి పూట నక్షత్రాలు మరుగైపోయి సూర్యుని ప్రకాశం ఒక్కటే పరచుకొనేటట్లుగా ఏ విధంగా ప్రవర్తిస్తాయో అలానే నీవు కూడా శక్తివంతుడైన నీ బాస్ తో ఆ నక్షత్రాల మాదిరిగానే ప్రవర్తించు.

Reversal: నీ బాస్ శక్తివంతుడు కాని పక్షంలో నీవు ఈ నియమాన్ని అనుసరించవలసిన అవసరం లేదు. అతన్ని నీ నైపుణ్యాలతో సాధ్యమైనంతగా డామినేట్ చేసి నీ ప్రాధాన్యతను నెలకొల్పుకోవడానికి ప్రయత్నించు.


The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.

Link 1 , Link 2